ram-radha letters in girl body: ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లా మధుగంజ్ కొత్వాలి గ్రామంలో ఒకటో తరగతి చదువుతున్న బాలిక శరీరంపై రామ్, రాధే అనే హిందీ పదాలు కనిపిస్తుండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కొద్దిరోజులుగా ఇలా కనిపిస్తూ ఉండటంతో బాలిక విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పింది. అయితే.. తల్లిదండ్రులు మొదట పట్టించుకోలేదు. బాలిక తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లకు ఇది ఏరకమైన వ్యాధో అంతుపట్టలేదు, ఎందుకు వచ్చిందన్నది కూడా స్పష్టంగా చెప్పలేకపోయారు. వారి కెరీర్‌లో ఇలాంటి వింత కేసును ఎప్పుడూ చూడలేదని అన్నారు. మొదట ఐదేళ్ల బాలిక శరీరంలోని కొన్ని భాగాలపై రామ్, రాధే అనే పదాలు ఉండటాన్ని ఉపాధ్యాయులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
అక్షరాలు కనిపించిన టైమ్‌లో నొప్పి, దురద లేదు
అప్పుడు డాక్టర్లు సైతం ఏమీ చెప్పలేకపోయారు. దేవేంద్రరాథోడ్ కుమార్తె ఐదేళ్ల సాక్షి కొంతకాలంగా ఈ వింత సమస్యతో బాధపడుతోంది. మధుగంజ్ సిటీలోని స్కూల్‌లో చదువుతున్న బాలిక శరీరంపై రాధే-రాధే, రామ్-రామ్ అనే అక్షరాలుగా ఉన్న గీతలను ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు గమనించారు. 20 రోజుల నుంచి సాక్షి శరీరంపై గీతలు కనిపిస్తున్నాయని తల్లిదండ్రులు అంటున్నారు. తమ కుమార్తెకు ఏం జరుగుతుందో అర్థంకాక అయోమయంలో పడిన తల్లిదండ్రులు చూపించని వైద్యులు లేరు. అయినా ఆ సమస్య ఏంటనేది ఎవరూ కచ్చితంగా చెప్పలేకపోయారు. ఆ అక్షరాలు కనిపించిన టైమ్‌లో ఆ తర్వాత తనకు ఎలాంటి నొప్పిగానీ, దురదగానీ లేదని బాలిక చెబుతోంది.
ఇది కూడా చదవండి: సింగిల్‌గానే మిగిలిపోవడానికి కారణాలు ఇవే అని తెలుసా..?
కొందరు వైద్యులు ఇది ఓ రకమైన చర్మవ్యాధి కావొచ్చని టెస్టులు చేయకుండా అప్పుడే నిర్థారించలేమని అంటున్నారు. మామూలుగా అయితే ఇలాంటివి మన బాడీపై కనిపిస్తే భయం వేస్తుంది, దేవుడి పేర్లు కాబట్టి కాస్త భక్తి భావం కూడా కలుగుతుంది. ఆ లెటర్స్ కనిపించిన పావుగంట తర్వాత సాక్షి శరీరం సాధారంగా అయిపోతుండటం విశేషం. సాక్షి తాత మాత్రం ఇదంతా భగవంతుడి దయేనని, మనవరాలి శరీరంపై దేవుడు అద్భుతాలు చేస్తున్నాడని, దేవుడి కృపకు పాత్రులమయ్యామంటూ చెప్పుకొచ్చారు. వైద్యులు మాత్రం సాక్షి శరీరంపై ఎందుకు అలాంటి గీతలు వస్తున్నాయి, ఎందుకు కాసేపటికే మాయమవుతున్నాయన్నదానిపై తలలు పట్టుకుంటున్నారు.