Bilkis Bano Case: బిల్కిస్ బానో కేసులో సుప్రీం తీర్పు బీజేపీకి చెంపపెట్టు: ఉత్తమ్

బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషులకు క్షమాభిక్షను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మంత్రి ఉత్తమ్ కుమార్‌ రెడ్డి స్వాగతించారు. దేశంలో నేరగాళ్ల మద్దతుదారుగా బీజేపీ పాత్ర ఏ పాటిదో సుప్రీం కోర్టు తీర్పు బయటపెట్టిందని, బీజేపీకి ఈ తీర్పు చెంపపెట్టంటూ విమర్శలు గుప్పించారు.

New Update
Bilkis Bano Case: బిల్కిస్ బానో కేసులో సుప్రీం తీర్పు బీజేపీకి చెంపపెట్టు: ఉత్తమ్

బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన కీలక తీర్పును అభినందిస్తూ.. 11 మంది దోషులకు క్షమాభిక్ష ప్రసాదించే గుజరాత్ ప్రభుత్వ ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తూ కోర్టు నిర్ణయాన్ని నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వాగతించారు. ఈ తీర్పు బీజేపీకి చెంపపెట్టని వ్యాఖ్యానించారు. దేశంలో నేరగాళ్ల మద్దతుదారుగా బీజేపీ పాత్ర ఏ పాటిదో సుప్రీం కోర్టు తీర్పు బయటపెట్టిందని ఉత్తమ్ అన్నారు. బిల్కిస్ బానో దృఢ సంకల్పం బీజేపీ ప్రభుత్వ పాలనపై న్యాయ పోరాటానికి ప్రతీక అని కొనియాడారు. న్యాయ ప్రక్రియ విజయం సాధించిందని సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ తీర్పు బీజేపీ మహిళా వ్యతిరేక విధానాలను బట్టబయలు చేసిందని, న్యాయ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించిందని అన్నారు. దేశంలో మతపరమైన లేదా కుల పరమైన అంశాలకు అతీతంగా న్యాయం జరగాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పి, నేరస్థులను చట్టవిరుద్ధంగా విడుదల చేయడాన్ని సమర్ధించే వారికి మందలింపుగా ఈ నిర్ణయాన్ని ఆయన అభివర్ణించారు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలు బిల్కిస్ బానోకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Also Read: కాళేశ్వరంలో ‘మేఘా’ అవినీతి రూ.50 వేల కోట్లు.. కాగ్ నివేదికలో సంచలన లెక్కలు!

కోర్టు ఫలితాలను హైలైట్ చేస్తూ పిటిషనర్ విధానంలో చిత్తశుద్ధి లోపించిందన్నారు. అలాగే మోసపూరిత చర్యలకు మద్దతు ఇవ్వడంపై గుజరాత్ ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు. లైంగిక, మత పరమైన నేరాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న దేశవ్యాప్త మహిళలకు బిల్కిస్ బానోను స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా పేర్కొన్నారు ఉత్తమ్. బిల్కిస్ బానోపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు భారత్‌లో మహిళా సాధికారతపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ బూటకపు వాదనలను బయటపెట్టిందని ఉత్తమ్ అన్నారు. భవిష్యత్తులో రేపిస్టులకు ఈ తీర్పు ఒక గుణపాఠంగా నిలుస్తుందని, నిందితులకు అండగా నిలుస్తున్న బీజేపీ నేతలను ఖండిస్తూ.. దోషుల విడుదలలో తమ పాత్రకు గుజరాత్, కేంద్ర బీజేపీ ప్రభుత్వాలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Also Read: ధరణిపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. కమిటీ ఏర్పాటు

Advertisment
తాజా కథనాలు