Menstruation: క్రమరహిత పీరియడ్స్ చాలా మంది మహిళలకు సమస్య. ఇది శరీరంలో ఇతర తీవ్రమైన వ్యాధులకు కూడా కారణమవుతాయి. కొంతమంది మహిళలకు పీరియడ్స్ ఆలస్యంగా వస్తాయి.. మరికొంతమందికి నెలల తరబడి రావు. అలాంటి సమయంలో కొంతమంది మహిళలు వైద్యుడిని కలిసి సిఫార్సు చేసిన మందులను వాడుతారు. కొంతమంది మహిళలు హోం రెమెడీస్ ట్రై చేస్తుంటారు. ఇక రుతుస్రావం ముగిసిన తర్వాత కొంతమంది మహిళలు ఒత్తిడికి లోనవుతారు. బరువు పెరగడంతో పాటు మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఇంకొంతమంది మహిళలు పీరియడ్స్ సకాలంలో రావడానికి బొప్పాయి తింటారు. పీరియడ్స్ ఆలస్యమైతే బొప్పాయి తినడం వల్ల సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెబుతుంటారు. అయితే ఇందులో నిజం ఎంత..?
తినవచ్చు.. నిజమే:
గైనకాలజిస్ట్‌ల ప్రకారం రుతుస్రావం కోసం పచ్చి బొప్పాయి తినడం ప్రయోజనకరంగా ఉంటుంది. పండిన బొప్పాయిని కూడా తినవచ్చు. ఇందులో ఉండే కెరోటిన్ ఈస్ట్రోజెన్ హార్మోన్‌ను ప్రేరేపిస్తుంది. అంతేకాకుడా ఈ పండులో ఇందులో విటమిన్-సి, విటమిన్-ఎ కూడా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.
ఇక బొప్పాయి తినడం వల్ల ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. బొప్పాయిలో మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, ఫోలేట్ లాంటి లక్షణాలు ఉన్నాయి. ఇది గుండెతో పాటు ఎముకలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అయితే బొప్పాయి ఎక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిదా లేదా హానికరమా అని మీ డాక్టర్ సలహాతో నిర్ణయించుకోండి. మీకు మీరుగా ఎలాంటి ప్రయోగాలు చేయకండి. క్రమం తప్పకుండా రుతుచక్రం కోసం వైద్యుడి నుంచి సరైన చికిత్స తీసుకోండి.
ఇది కూడా చదవండి: మన అనుకుని వెళ్తే మనకే అనర్థం..ఎలాగో తెలుసా..?
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: మీ పిల్లలు నిద్రలో మంచం తడుపుతున్నారా..? ఇలా చేస్తే డైపర్ల అవసరమే లేదు!