Cholesterol: చెడు ఆహారం, జీవనశైలి కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. ఆహారంతో పాటు వంట నూనెల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ నూనె పడితే అది వాడటం వల్ల కొలెస్ట్రాలు పెరిగిపోతాయి. కొన్ని వంట నూనెలు వాడటం వల్ల కొలెస్ట్రాలను తగ్గించుకోవచ్చు కూడా. ఆహారంలో మనం ఎక్కువగా నూనె పదార్థాలు తీసుకుంటూ ఉంటాం. దీని వల్ల కొలెస్ట్రాల్ కూడా చాలా వేగంగా పెరుగుతాయి. హైబీపీ, హార్ట్ ఎటాక్, కరోనరీ ఆర్టరీ డిసీజ్ వంటి సమస్యలను వస్తాయి.
అవిసె గింజల నూనె:
అవిసె గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది శరీరంలో మంటను నివారిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటే వంటలో ఆలివ్ నూనెను ఉపయోగించవచ్చు. అయితే దీన్ని వాడేటప్పుడు వేడెక్కకూడదని, ఫ్రిజ్‌లో పెట్టకూడదని నిపుణులు అంటున్నారు.
ఆలివ్ నూనె:
భారతదేశంలో ఆలివ్ నూనె ఉత్పత్తి చాలా తక్కువగా ఉంది. మిడిల్ ఈస్ట్ లేదా మెడిటరేనియన్ దేశాల నుంచి దిగుమతి చేసుకునే స్థితిలో ఉన్నాం. కాబట్టి దీని ధర ఎక్కువ. ఆలివ్ నూనె ధర ఎక్కువగా ఉన్నప్పటికీ ఇది ఆరోగ్యానికి ప్రయోజనకరం. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కె ఉంటాయి. కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది.
వేరుశెనగ నూనె:
వేరుశెనగ చాలా మందికి ఇష్టమైనది. కానీ దాని నూనెను ఎక్కువగా ఉపయోగించరు. దీనితో వంటలు చేస్తే ఆరోగ్యకరమని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఇందులో విటమిన్ ఇ, ఫైటోస్టెరాల్ ఉంటాయని చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: పెళ్లి కూతురు తాప్సీ ఎంట్రీ అదుర్స్..వైరల్ అవుతున్న వీడియో
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.