USA: థాంక్యూ సర్ అనడమే తప్పయిపోయింది..

పొరపాటున చేసిన తప్పును కూడా క్షమించలేదు విమాయయాన సిబ్బంది. థాంక్యూ సర్ అనడాన్ని పద్ద నేరంగా పరిగణించి విమానం ఎక్కకుండా చేశారు. శాన్‌ఫ్రాన్సిస్కో యునైటెడ్ ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

New Update
USA: థాంక్యూ సర్ అనడమే తప్పయిపోయింది..

అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ఆస్టిన్‌కు యునైటెడ్ ఎయిర్ లైన్స్‌ విమానం రెడీ అయింది టెక్సాస్‌కు చెందిన జెన్నా లాంగోరియా తన కుమారుడు, తల్లితో కలిసి ప్రయాణం చేస్తున్నారు. ఈ క్రమంలో సిబ్బంది ఆమెకు బోర్డింగ్‌ పాస్‌ను అందించారు. అయితే జెన్నా దీనికి థాంక్స్ చెబుతూ పొరపాటున ధాంక్య మేడమ్ అనకుండా థాంక్యూ సర్ అంది. అదే ఆమె చేసిన పొరపాటు. అక్కడ ఉన్న మహిళా సిబ్బంది దీనికి చాలా ఫీల్ అయిపోయింది. ఆ పిలుపునకు ఆమె ఆగ్రహానికి గురైంది. ప్రయాణికురాలి తల్లిని, బిడ్డను లోనికి వెళ్లకుండా ఆపేసింది.

అదే సమయంలో జెన్నా లాంగోరియా మరో మేల్‌ ఫ్లైట్‌ అటెండెంట్‌ సాయం కోరింది. తన తల్లి, కుమారుడిని ఆయన గేట్‌ దగ్గర ఆపేశారని ఫిర్యాదు చేసింది. ఫ్లైట్‌ అటెండెంట్‌ ‘ఆయన’ కాదు ‘ఆమె’ అని బదులిచ్చారు. తన తప్పును తెలుసుకుని ఆ మహిళా సిబ్బందికి క్షమాపణలు చేప్పేందుకు ప్రయత్నించినా వినిపించుకోకపోగా.. విమానం నుంచి దింపేశారు జెన్నాను. ఈ మొత్తం వ్యవహారాన్ని సోషల్‌ మీడియాలో చెప్పుకొచ్చింది జెన్నా. తాను ఎంత ఆవేదన చెందినదీ వెల్లడించింది.ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. జెన్నా లాంగోరియా టెక్సాస్‌కు చెందిన మహిళా ఆరోగ్య నిపుణురాలుగా ఉన్నారు.

Also Read:T20 world Cup: ఇంగ్లాండ్‌ను చిత్తుగా ఓడించిన ఇండియా..ఫైనల్స్‌లోకి ఎంట్రీ 

Advertisment
తాజా కథనాలు