US,UK- ప్రతీకారం మొదలుపెట్టిన అమెరికా..భారీ వైమానిక దాడులు! శుక్రవారం నాడు ఇరాక్, సిరియాలో అమెరికా భీకరమైన దాడులు నిర్వహించింది. ఇరాన్- మద్దతుగల గ్రూపులకు చెందిన 85 లక్ష్యాల పై అమెరికా సైన్యం సుమారు 85 లక్ష్యాలపై భారీ వైమానిక దాడులకు పాల్పడింది.ఇరాక్, సిరియాలో జరిగిన దాడిలో సుమారు 40 మంది మరణించారు. By Bhavana 04 Feb 2024 in క్రైం ఇంటర్నేషనల్ New Update షేర్ చేయండి US-UK: జోర్దాన్ లో జరిగిన దాడిలో అమెరికా సైనికులు ముగ్గురు మృతి చెందిన ఘటన లో అమెరికా తన ప్రతీకారాన్ని తీర్చుకుంది. శుక్రవారం నాడు ఇరాక్, సిరియాలో అమెరికా భీకరమైన దాడులు నిర్వహించింది. ఇరాన్- మద్దతుగల గ్రూపులకు చెందిన 85 లక్ష్యాల పై అమెరికా సైన్యం సుమారు 85 లక్ష్యాలపై భారీ వైమానిక దాడులకు పాల్పడింది. ఇరాక్, సిరియాలో జరిగిన దాడిలో సుమారు 40 మంది మరణించారు. ఇరాక్ లో 16 మంది మరణించగా, సిరియాలో 23 మంది మరణించినట్లు అధికారిక సంస్థలు వెల్లడించాయి. ఈ దాడుల్లో అమెరికన్ సైనికులు కూడా కొందరు మరణించగా...మరికొందరు గాయపడ్డారు. దీంతో స్వయంగా అమెరికా అధ్యక్షుడే దీని గురించి వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ముగ్గురు అమెరికా సైనికులు మరణించే సరికి అమెరికా దాడులు ప్రారంభించింది. అమెరికన్ బీ-బీ1 బాంబర్ ఇరాక్, సిరియాలో భారీ దాడులకు దిగింది. ఎఫ్-15 ఈ, ఏ-10 సీ యుద్ద విమానాలు ఇరాక్, సిరియా పై ఏకకాలంలో అనేక లక్ష్యాల పై ల్యాండ్ మైన్ దాడులు ప్రారంభించాయి. ఈ యుద్దం లో 125 రకాల గైడెడ్ ఆయుధాలను అమెరికా సైన్యం వినియోగించింది. ఈ దాడులు తరువాత బిడెన్ మాట్లాడుతూ..మాకు యుద్దం వద్దు..అయితే మాకు హాని కలిగించే వారిని విడిచిపెట్టం అని హెచ్చరించారు. అయితే అమెరికా విమానాలు బాంబులు వేసిన ప్రాంతాల్లో ఇరాక్ సైనికులతో పాటు సామాన్య ప్రజలు కూడా నివసించే ప్రదేశాలు కూడా ఉన్నాయని అక్కడి అధికారిక సంస్థలు తెలిపాయి. Also read: భారీ అగ్ని ప్రమాదం..46 మంది మృతి..వేలాది ఇళ్లు దగ్ధం! #uk #yeman #siriya #iran #america మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి