అయోధ్యలో ప్రధాని చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. కోట్లాదిమంది భక్తులు ఈ దృశ్యాన్ని చూసి పులకించిపోయారు. ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా రాముని నామస్మరణలు మారుమోగిపోతున్నాయి. ప్రతి గ్రామాల్లో రాముని ఉత్సవాలు జరుపుకుంటున్నారు. అయోధ్యకు కూడా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు వేలాది మంది హాజరయ్యారు. ప్రాణప్రతిష్ఠ పూర్తయ్యాక దేశప్రజల్ని ఉద్దేశించి మట్లాడారు.
Also Read: అయోధ్య రామాలయానికి ఎక్కువగా విరాళం ఇచ్చింది ఎవరో తెలుసా..
ప్రవాస భారతీయుల సంబరాలు
ఈ వేడుక సందర్భంగా అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న టైమ్స్ స్క్వేర్‌లో కూడా జై శ్రీరామ్ నినాదాలు మారుమోగాయి. సంప్రదాయాలు ఉట్టిపడేలా భజనలు, కీర్తనలతో ప్రవాస భారతీయులు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అక్కడ విద్యుత్ బిల్‌బోర్డ్‌పై రాముడి చిత్రాలను ప్రదర్శించారు. మసాచుసెట్స్‌లోని వొర్సెస్టర్ నగర్ మేయర్ కూడా రామాలయ ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ఫ్రాన్స్ రాజధాని ప్యారీస్‌లో కూడా ప్రవాస భారతీయులు ఈఫిల్ టవర్ వద్ద రామాలయ ప్రారంభోత్సవ వేడుకలు జరుపుకున్నారు.
ఈరోజు దీపావళి పండుగ
ఇదిలాఉండగా రామాలయ ప్రారంభోత్సవంపై ప్రధాని మోదీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకట్టుప్పుడు టెంటులో ఉన్న బాలరాముడు ఇకనుంచి మందిరంలో ఉంటాడని.. బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠకు హాజరుకావడం తన అదృష్టమని తెలిపారు. ఎన్నో పోరాటాలు, బలిదానాల తర్వాత అయోధ్యలో ఈ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైనట్లు పేర్కొన్నారు. న్యాయబద్ధంగానే రామాలయాన్ని నిర్మించామని.. దేశం మొత్తం ఈరోజు దీపావళి పండుగ జరుపుకుంటోందని వ్యాఖ్యానించారు.
Also Read: రాహుల్ గాంధీకి చేదు అనుభవం.. గుడిలోకి అనుమతించని ఆలయ కమిటీ