Dreams: అద్భుతం.. ఈ పరికరంతో కలల్ని నియంత్రిచ్చుకోవచ్చు..

నిద్రలో వచ్చే కలల్ని నియంత్రించగలిగేలా అమెరికాకు చెందిన ఓ స్టార్టప్‌ కంపెనీ వినూత్న పరికరాన్ని అభివృద్ధి చేస్తోంది. దీనివల్ల ఈ పరికరం ద్వారా మనకు వచ్చే కలల్ని ఆపడమే కాకుండా మనం ఎలాంటి కలలు కనాలి... కలల్లోనే జీవితానికి అవసరమైన నైపుణ్యాల గురించి తెలుసుకోవచ్చు.

Dreams: అద్భుతం.. ఈ పరికరంతో కలల్ని నియంత్రిచ్చుకోవచ్చు..
New Update

నిద్రలో ఉన్నప్పుడు మనకు ఎన్నో రకాల కలలు వస్తుంటాయి. అందులో కొన్ని ఆనందాన్ని కలిగించేవి ఉంటాయి.. మరికొన్ని భయం కలిగించేవి ఉంటాయి. అయితే కలల్ని కూడా నియంత్రించగలిగేలా అమెరికాకు చెందిన ప్రొఫెటిక్ అనే స్టార్టప్‌ కంపెనీ ఓ పరికరాన్ని అభివృద్ధి చేస్తోంది. అంతేకాదు దీనికి హలొ(Halo) అనే పేరు కూడా పెట్టారు. ఈ పరికరం ద్వారా మనకు వచ్చే కలల్ని ఆపడమే కాకుండా మనం ఎలాంటి కలలు కనాలి... అలాగే కళల్లోనే జీవితానికి అవసరమైన నైపుణ్యాలు, మెళుకువల్ని ఎలా నేర్చుకోవచ్చో నిర్దేశించవచ్చని చెబుతోంది. కిరీటంలా ఉన్న ఈ పరికరం అల్ట్రాసౌండ్, మెషిన్ లెర్నింగ్‌ల ఆధారంగా పనిచేస్తుందని కంపెనీకి చెందిన పరిశోధకులు చెబుతున్నారు. దీని ధర 1.25 లక్షల నుంచి 1.66 లక్షల మధ్య ఉండొచ్చని పేర్కొంది.

Also read: కరీంనగర్ పార్లమెంట్ పై ‘బండి’ గురి.. రోడ్ మ్యాప్ రెడీ!

అయితే ఆల్ట్రాసౌండ్, మెషిన్ లెర్నింగ్‌ మోడల్‌లో పనిచేసే ఈ హలొ.. మనం లూసిడ్‌ డ్రీమ్‌ స్టేట్‌లో ఉన్నప్పుడు వచ్చే కలల్ని విశ్లేషిస్తుంది. ఇంకొంచెం వివరాల్లోకి వెళ్తే.. వాస్తవానికి నిద్రలో రెండు దశలు ఉంటాయి. నిద్రపోయే సమయాన్ని ఆర్‌ఈఎం, నాన్‌ ఆర్‌ఈఎంగా పరిశోధకులు విభజిస్తారు. కనురెప్పలు మూసి కనుగుడ్లు వేగంగా ఆడిస్తూ నిద్రపోయే ప్రక్రియను ఆర్‌ఎంఈ అని అంటారు. దీన్నే లూసిడ్‌ డ్రీమ్ అని పిలుస్తారు. అయితే మనం ఎలాంటి కలల్ని కనాలనుకుంటున్నామో వాటిని ఇది ప్రోగ్రామింగ్ ద్వారా ప్రవేశపెడుతుంది. సొంత స్పృహను అన్వేషించే సామర్థ్యాన్ని మీకు అందించే లక్ష్యంతో ఈ పరికరాన్ని తయారుచేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. అయితే ఇలా కలల్ని నియంత్రించుకోవడం వల్ల ఆ సమయం ఉత్పాదకంగా వినియోగించుకోవచ్చని పేర్కొంది. ఉదాహరణకు ఒక వెబ్‌ డిజైనర్‌, వెబ్‌సైట్ తయారీకి సంబంధించి కొత్త టెంప్లెట్స్‌ను తయారుచేసుకోవచ్చని.. అలాగే ఒక సీఈవో జరగబోయే బోర్టు సమావేశాన్ని ప్రాక్టీసు చేసుకోవచ్చని తెలిపారు. ఎలాన్‌ మస్క్‌కు చెందిన బ్రెయిన్‌ ఇంప్లాంట్‌ కంపెనీ న్యూరాలింక్‌ను రూపొందించిన ఆప్షిన్ మెహిత్ సహకారంతో ఈ పరికరాన్ని తయారుచేశారు.

#telugu-news #international-news #dreams
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe