USA : భారత్‌ను మరోసారి మెచ్చుకున్న అమెరికా.. భారత్‌లో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలపై అమెరికా ప్రశంసలు కరిపించింది. ప్రపంచంలో భారత్ కంటే శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలో మరొకటి లేదంటూ కొనియాడింది. భారత్‌తో తమ బంధం చాలా సన్నిహితంగా ఉందని.. ఇంకా దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తామంటూ పేర్కొంది. By B Aravind 18 May 2024 in ఇంటర్నేషనల్ రాజకీయాలు New Update షేర్ చేయండి US - India : భారత్‌లో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలపై (Lok Sabha Elections) అమెరికా (America) ప్రశంసలు కరిపించింది. ప్రపంచంలో భారత్ కంటే శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలో మరొకటి లేదంటూ కొనియాడింది. వైట్‌హౌస్ జాతీయ భద్రతా సమాచార సలహాదారు జాన్ కిర్బీ (John Kirby).. ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ.. ' భారతీయులు తమ దేశంలో ఓటు వేయడంతో పాటు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పడం ప్రశంసనీయం. ఇప్పుడు భార్‌త్‌లో 96 కోట్ల మంది ప్రజలు ఓటింగ్‌లో ప్రక్రియలో భాగమవుతున్నారు. 2,660 గుర్తింపు పొందిన పార్టీల నుంచి 545 మంది పార్లమెంటు సభ్యలను ఎన్నుకోబోతున్నారని' అన్నారు. Also read: భారత్, మాల్దీవుల వివాదంతో..లాభ పడుతున్న శ్రీలంక.. అలాగే భారత్‌లో జరుగుతున్న ఈ ఎన్నికల అమెరికా గమనిస్తోందని.. బైడెన్(Biden) పాలనలో గత మూడేళ్లలో ప్రధాని మోదీ హయాంలో భారత్-అమెరికా సంబంధాలు బలోపేతం అయ్యాయని జాన్ కిర్బీ తెలిపారు. భారత్‌తో తమ బంధం చాలా సన్నిహితంగా ఉందని.. ఇంకా దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తాంటూ పేర్కొన్నారు. ప్రధాని మోదీతో మరింత స్నేహాన్ని పెంచుకోవాలని బైడెన్ భావిస్తున్నారని అన్నారు. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలపై ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. ఇండో - పసిఫిక్ క్వాడ్‌ను విస్తరించి ఇరుదేశాల సైన్యాలు ఇప్పటికే అనేక యుద్ధ విన్యాసాల్లో పాల్గొన్నాయని గుర్తుచేశారు. Also Read: తైవాన్ పార్లమెంట్‌లో తీవ్ర గందరగోళం..ఒకరినొకరు కొట్టుకున్న ఎంపీలు! #usa #india #2024-lok-sabha-elections #john-kirby మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి