Elon Musk: ట్రంప్‌కు ఎలాన్‌ మస్క్‌ భారీ విరాళం.. ఫిగర్ చూస్తే కళ్లు చెదిరిపోతాయి!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి బరిలో దిగనున్న డొనాల్డ్‌ ట్రంప్‌కు ఎలాన్ మస్క్ భారీ విరాళం ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. రిపబ్లికన్‌ పార్టీకి రూ.376 కోట్లు ఇచ్చేందుకు మస్క్ సిద్ధమైనట్లు సమాచారం. ఇటీవలే తన పూర్తి మద్దతు ట్రంప్ కే ఉంటుదని మస్క్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

New Update
Elon Musk: ట్రంప్‌కు ఎలాన్‌ మస్క్‌ భారీ విరాళం.. ఫిగర్ చూస్తే కళ్లు చెదిరిపోతాయి!

US Presidential Election: మరోసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్న రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌కు (Donald Trump) పూర్తి మద్దతు ఇస్తున్నట్లు స్పేస్‌ఎక్స్‌, టెస్లా సంస్థ అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) ప్రకటించారు. అంతేకాదు ట్రంప్ కోసం భారీఎత్తున విరాళాలు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ప్రతినెలా ట్రంప్ పార్టీకి 45 మిలియన్‌ డాలర్లు (రూ.376 కోట్లు) ఇచ్చేందుకు సిద్ధమైనట్లు మస్క్ సన్నిహితులు వెల్లడించినట్లు కథనాలు వెలువడ్డాయి.

ట్రంప్ కే పూర్తి మద్దతు..
అయితే ఈ ఎన్నికల్లో ట్రంప్‌, బైడెన్‌కు (Joe Biden) ఆర్థిక సహకారం చేయనున్నట్లు గతంలో మస్క్‌ తెలిపిన సంగతి తెలిసిందే. కాగా ఇటీవల అమెరికా రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామాలు, ట్రంప్‌పై కాల్పుల ఘటనతో మనసు మార్చుకున్న మస్క్.. ట్రంప్ కే పూర్తి మద్దతు ప్రకటించారు. ఇప్పటికే సూపర్‌ ప్యాక్‌కు ప్రముఖ బ్యాంకర్‌ థామస్‌ మెలాన్‌ మునిమనవడు అత్యధికంగా 50 మిలియన్‌ డాలర్ల విరాళం అందించారు. ఇదిలా ఉంటే.. ఓ దుండగుడు ట్రంప్‌పై కాల్పులు జరపగా తృటిలో ప్రాణపాయం తప్పింది. ఈ ఘటనపై తనదైన స్టైల్ రియాక్ట్ అయిన మస్క్‌.. ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో ట్రంప్‌నకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ట్రంప్ కు భారీగా పెరిగిన మద్ధతు.. 
ఇదిలా ఉంటే.. ట్రంప్‌పై దాడి జరిగిన మూడు గంటల్లోపే చైనా మార్కెట్లలో ట్రంప్ టీషర్టులు వచ్చేశాయి. దాడి జరిగిన అనంతరం ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో టీ షర్టులపై ముద్రించారు. ఐ విల్‌ నెవర్ స్టాప్‌, ఫైట్‌ ఫర్ అమెరికా, షూటింగ్‌ మేక్స్‌ మీ స్ట్రాంగర్ అంటూ ట్రంప్ అన్న ఈ వ్యాఖ్యలను టీషర్టులపై ముద్రించారు. మరోవైపు ట్రంప్‌పై దాడి జరిగిన తర్వాత ప్రజల్లో ఆయనకు మరింత మద్దతు పెరిగినట్లు పోలస్‌ స్టర్‌ తాజా నివేదికలో తెలిపింది. ఈ ఘటన తర్వాత ప్రజల నుంచి ట్రంప్‌నకు 8 శాతం మద్ధతు పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. దీంతో జో బైడెన్‌ (Joe Biden) కంటే ట్రంప్ ముందు వరుసలో ఉన్నారని, దేశ అధ్యక్షునిగా ట్రంప్‌ను గెలిపించేందుకు ఏకంగా 70 శాతం అవకాశాలు ఉన్నాయని ఈ సర్వే అంచనా వేసింది.

Advertisment
తాజా కథనాలు