అమెరికాకు అక్రమ ప్రవేశం చేస్తూ పట్టుబట్ట 97వేల మంది భారతీయులు.. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించిన 96 వేల మంది భారతీయులు అక్కడి అధికారులకు పట్టుబడటం కలకలం రేపుతోంది. గత నాలుగేళ్లగా వీరి సంఖ్య ఏటా పెరుగుతోంది. ఇలా అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించి కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. By B Aravind 03 Nov 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న భారతీయుల సంఖ్య ఏటా పెరుగుతూ వస్తోంది. 2022 అక్టోబర్ నుంచి 2023 సెప్టెంబర్ మధ్య అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించిన 96,917 మంది భారతీయులను అదుపులోకి తీసుకున్నట్లు యూఎస్ కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ ఏజెన్సీ తెలిపింది. అయితే గత కొన్నేళ్లుగా ప్రమాదకర మార్గాల నుంచి అక్రమంగా ప్రవేశించడం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ కూడా వీరు తమ ప్రయత్నాలను ఆపడం లేదు. అధికారులకు పట్టుబడ్డ 96,917 మంది భారతీయుల్లో.. 30,010 మంది కెనడా సరిహద్దు వద్ద, 41,770 మంది అమెరికా-మెక్సికో సరిహద్దు వద్ద పట్టుబడ్డారు. మిగిలినవారు అక్రమంగా చొరబడ్డ తర్వాత చిక్కారు. అయితే ఇవి కేవలం రికార్ట్ అయిన కేసులు మాత్రమేనని.. వాస్తవానికి ఇలా అక్రమంగా ప్రవేశించేవారి సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. 2019-2020 మధ్య 19,883 మంది పట్టబడగా.. 2022-2023 నాటికి 96,917 కి చేరుకుందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సరిహద్దుల్లో పట్టుబడిన ప్రతిఒక్కరిలో.. కనీసం పదిమంది విజయవంతంగా యూఎస్‌లోకి అక్రమంగా ప్రవేశిస్తున్నారని గుజరాత్‌కు చెందిన ఓ పోలీస్ అధికారి తెలిపారు. చాలామంది ప్రమాదకరమైన మార్గాలను ఎంచుకొని వెళ్తున్నారని.. ముఖ్యంగా అమెరికాలో స్థిరపడాలనే కోరికతో గుజరాత్, పంజాబ్ రాష్ట్రాల నుంచే ఎక్కువగా ఇలా అక్రమంగా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అయితే ఇలా యూఎస్‌లో పట్టుబడ్డవారివారిని నాలుగు కేటగిరీలుగా విభజించారు అక్కడి అధికారులు. అవి 1.తల్లిదండ్రులు తోడు లేని పిల్లలు, 2.కుటంబం సభ్యులతో ఉన్న చిన్నారులు, 3. మొత్తం కుటుంబ సభ్యులు,4.ఒంటరిగా ఉన్న పెద్దలు. అయితే ఇలా పట్టుబడిన వారిలో ఒంటరిగా ఉన్న పెద్దలే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఈసారి పట్టుబడినవారిలో ఏకంగా 84 వేలమంది సింగిల్ అడల్ట్స్ ఉన్నారు. అలాగే ఏ తోడు లేని చిన్నారులు 730 మందిని కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. 2022 డిసెంబర్‌లో గుజరాత్‌లోని గాంధీనగర్‌కు చెందిన బ్రిజ్‌కుమార్ యాదవ్ కుటుంబ సభ్యులు యూఎస్‌లో ప్రవేశించడానికి ట్రంప్ వాల్ ఎక్కేందుకు ప్రయత్నించారు. కానీ ఆ గొడ ఎక్కుతుండగా బ్రిజ్‌కుమార్ తన మూడేళ్ల బిడ్డను పట్టుకొని మెక్సికన్ ప్రాంతం వైపు పడిపోయారు. ఈ ఘటనలో బ్రిజ్‌కుమార్ చనిపోయాడు. అలాగే అతని భార్య పూజా.. 30 ఫీట్ల ఎత్తు నుంచి యూఎస్ వైపు పడిపోయింది. చివరికి ఆ మూడేళ్ల చిన్నారిని ఇమిగ్రేషన్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. అక్కడ పట్టుబట్ట చాలామంది భారత చిన్నారులు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నవారే కావడం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఇలాంటి విషాద ఘటనలు జరిగినప్పటికీ కూడా యూఎస్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నాలు చేసేవారి సంఖ్య మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. మరోవైపు అక్కడ చాలామంది భారతీయులు పట్టుబడుతున్నప్పటికీ.. కొద్దిమందిని మాత్రమే ఇండియాకు రిటర్న్ పంపిస్తున్నారని.. మిగిలినవారికి శరణార్థులగా అక్కడే ఆశ్రయం పొందుతున్నారని కేంద్ర సంస్థల అధికారులు, గుజరాత్ పోలీసులు చెబుతున్నారు. Also Read: ఏ పార్టీకి ఎన్ని విరాళాలొచ్చాయో చెప్పండి.. ఈసీకి సుప్రీం కోర్టు ఆదేశం #telugu-news #usa #indians #us-border మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి