Biden and Xi Jinping Meeting: దాదాపు ఏడేళ్ళ తరువాత చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ (Xi Jinping) అమెరికా వెళ్ళారు. ఆ దేశ ప్రెసిడెంట్ జో బైడెన్ (Joe Biden) ను కలిశారు. ఇద్దరూ చాలా సేపు మాట్లాడుకున్నారు. రెండు దేశాల (US And China) మధ్య విబేధాలు సమసిపోయేలా, దౌత్య సంబంధాలు తప్పదోవపట్టకుండా కృషి చేయడానికి అధ్యక్షులు ఇద్దరూ అంగీకరించారు. ఈ సమావేశంలో ఇరువురు నేతలు ద్వైపాక్షిక సంబంధాలు, ఇరాన్, పశ్చిమాసియా, ఉక్రెయిన్, తైవాన్, ఇండో-పసిఫిక్, ఆర్థిక సమస్యలు, కృత్రిమ మేధస్సు, ప్రపంచ సమస్యలపై చర్చించారు. సమ్మిట్ బాగా అయింది. జిన్ పింగ్ వెళిపోతుంటే ఆయన కారు వరకు వచ్చి మరీ బైడెన్ సాగనంపారు. కారును చూసి మెచ్చుకున్నారు కూడా.
Also Read:“ఏనుగులు వెళుతుంటే కుక్కలు మొరుగుతున్నట్లు”..అస్సలు ఓర్చుకోలేకపోతున్నారుగా
అంతా బాగానే ఉంది అనుకుంటే అమెరికా అధ్యక్షుడు తరువాత మీడియా సమావేశంలో జిన్ పింగ్ నియంతే అంటూ కామెంట్స్ చేశారు. జిన్‌పింగ్‌ను నియంతలాగే చూస్తున్నారా..? అని ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానమిచ్చారు. అతను కమ్యూనిస్ట్ దేశాన్ని పాలిస్తున్నారు. ఆ ప్రభుత్వమే డిఫరెంట్ అంటూ వ్యాఖ్యలు చేశారు. బైడెన్ కామెంట్ మీద చైనా సీరియస్ అయింది. ఇంత బాధ్యతారాహిత్యంగా ఎలా మాట్లాడతారంటూ మండిపడింది. ఇంతకు ముందు కూడా జో బైడెన్ ఇదే మాట అన్నారు జిన్ పింగ్ ను. ఇప్పుడు మళ్ళీ అదే రిపీట్ చేయడం చర్చనీయంగా మారింది.
సుమారు నాలుగు గంటలపాటూ అమెరికా అధ్యక్సుడు జో బైడెన్, చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్ మాట్లాడుకున్నారు. ఇరు దేశాలు చాలా వరకు ఒక ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది. అమెరికాను ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదని జిన్ పింగ్ చెబుతున్నారు. అలాగే తమని కూడా అగ్రరాజ్యం అణదొక్కకూదని కోరామని అన్నారు. ఇక అమెరికాలో అక్రమంగా వ్యాపారం నిర్వహిస్తున్న డ్రగ్స్ కంపెనీల మీద చర్యలు తీసుకుంటామని జిన్ పింగ్ హామీ ఇచ్చారు.