Live in Relationship: 30 ఏళ్ల మహిళతో సహజీవనం చేస్తున్న తండ్రి.. కొడుకులు ఏం చేశారో తెలిస్తే షాక్ ఉత్తరప్రదేశ్‌లోని ఓ దారుణం వెలుగుచూసింది. ఓ తండ్రి మరో మహిళతో సహజీవనం చేయడాన్ని చూసి ఆయన కొడుకులు అతనిపై దాడికి పాల్పడ్డారు.అమ్రోదా అనే పట్టణంలో రామ్ ప్రకాశ్ ద్వివేది(83),అతని కుమారుడు విమల్(63), అతని భాగస్వామి ఖుష్బు(30) కలిసి ఉంటున్నారు. అయితే విమల్ 30 ఏళ్ల మహిళతో కలిసి సహజీవనం చేయడాన్ని చూసి అతడి కొడుకులు తట్టుకోలేకపోయారు. తాజాగా వారి మధ్య గొడవ జరగడంతో.. కొడుకులు తాతా, ఖుష్బును కత్తితో పొడిచి హత్య చేశారు. తండ్రి గాయాలతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. By B Aravind 19 Oct 2023 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి ఈ మధ్యకాలంలో సహజీవనం చేయడం అనేది సాధారణం అయిపోయింది. విదేశాలతో సహా భారత్‌లో కూడా చాలామంది లీవ్ ఇన్ రిలేషన్‌షిప్ వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఇలా సహజీవనం చేసే జంటలో కొందరు సంతోషంగా గడిపిన తర్వాత వివాహం చేసుకుంటున్నారు. మరికొందరు ఒకరినొకరు అర్ధం చేసుకోలేక, సర్ధుకోలేక విడిపోతున్నారు. అలాగే ఈ మధ్య ఇలా సహజీవనం చేసే వారిలో హత్యలు లాంటివి జరిగిన సంఘటనలు కూడా వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. ఢిల్లీలోని శ్రద్ధావాకర్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత మరికొన్ని దుర్ఘటనలు కూడా జరిగాయి. అయితే ఇప్పుడు తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఓ దారుణం వెలుగుచూసింది. ఓ తండ్రి మరో మహిళతో సహజీవనం చేయడాన్ని చూసి ఆయన కొడుకులు అతనిపై కిరాతకానికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోదా అనే పట్టణంలో రామ్ ప్రకాశ్ ద్వివేది(83), అతని కుమారుడు విమల్(63), అతని భాగస్వామి ఖుష్బు(30) కలిసి ఉంటున్నారు. అయితే విమల్ 30 ఏళ్ల మహిళతో కలిసి సహజీవనం చేయడాన్ని చూసి అతడి కొడుకులు తట్టుకోలేకపోయారు. ఈ విషయంలో వారి కుటుంబంలో తరుచుగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ క్రమంలోనే విమల్ కొడుకు లలిత్ (42) వారిని అంతమొందిచాలని ప్లాన్ వేశాడు. అతని సోదరుడు అక్షత్ (18)తో కలిసి తండ్రి ఇంటికి వెళ్లి గొడవకు దిగారు. ఆ తర్వాత తాత, తండ్రి, మహిళను విచక్షణారహితంగా కొట్టారు. అనంతరం రామ్ ప్రకాశ్, ఖుష్టును కత్తితో పొడిచి హత్య చేశారు. నిందితుల నుంచి తప్పించుకునేందుకు విమల్ ఇంటి నుంచి బయటకు పరిగెత్తాడు. ఈ విషయాన్ని గమనించి ఇంటి పక్కన ఉన్న మున్నా అనే వ్యక్తి.. పక్క ఇంట్లోనే ఉంటున్న విమల్ అన్న కమల్‌కు ఈ విషయం చెప్పాడు. దీంతో అతడు విమల్‌ను జిల్లా ఆసపత్రికి తరలించారు. ఆ తర్వాత కాన్పూర్‌లోని లాలా లజపత్ రాయ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం అతని వైద్యుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. అయితే.. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. అక్షత్, అలాగే లలిత్‌ను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. 30 ఏళ్ల ఖుష్బుతో తండ్రి సంబంధపై ఇద్దరు కుమారులు అసంతృప్తిగా ఉన్నట్లు అదనపు పోలీసు సూపరింటెండెంట్ రాజేష్ కుమార్ పాండే పేర్కొన్నారు. అయితే ఈ విచారణలో రామ్‌ప్రకాష్, ఖుష్బులను హత్య చేసినట్లు నిందితులు అంగీకరించారని వెల్లడించారు. #telugu-news #national-news #live-in-relationship మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి