/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/cmr-jpg.webp)
ఉప్పల్ లోని సీఎంఆర్ షాపింగ్ మాల్ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలకు గల కారణాలు తెలియలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. షాపింగ్ మాల్ లో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగలను పురస్కరించుకోని కస్టమర్లను ఆకట్టుకునేందుకు షాపింగ్ మాల్ ముందు భారీగా డెకరేషన్ చేశారు.
వాటికే మంటలు అంటుకున్నట్లు సమాచారం. అయితే మంటలు అంటుకున్న సమయంలో షాపింగ్ మాల్ లో ఎంతమంది ఉద్యోగులు, కస్టమర్లు ఉన్నారు అనేది తెలియలేదు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు. దీంతో అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.
వెంటనే రంగంలోకి దిగి మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఉప్పల్ పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు అదుపులోకి వచ్చిన తరువాతే ఆస్తి నష్టం, ప్రాణ నష్టం వివరాలు తెలిసే అవకాశముంది.
CMR showroom burning into ashes in Uppal
— Shiva Krishna Veera (@Shiva_Veeramas) January 2, 2024
Cause for fire accident is unknown #Hyderabad#Uppal pic.twitter.com/g6TnOh48i0
Updated soon....