CM Revanth: పెన్షన్‌ రూ. 4వేలకు పెంపు.. రూ. 500కే గ్యాస్ సిలిండర్‌.. ఆ రోజునుంచే?

రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే రెండు పథకాలను అమల్లోకి తెచ్చిన కాంగ్రెస్ సర్కార్.. మరో రెండు పథకాలైన పెన్షన్ పెంపు, రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకాలను అమల్లోకి త్వరలో తేనున్నట్లు సమాచారం.

New Update
CM Revanth : రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. అందరికీ డిజిటల్‌ హెల్త్‌ కార్డులు!

Telangana Congress: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలల్లో రెండు గ్యారెంటీలను అమల్లోకి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు టికెట్ లేకుండా ఉచిత ప్రయాణం, అలాగే ఆరోగ్య శ్రీ కార్డు పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచుతూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

ALSO READ: పార్లమెంట్ ఎన్నికలు.. నేడు ఇండియా కూటమి భేటీ

తాజాగా మరో రెండు గ్యారెంటీలను అమల్లోకి తెచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం అధికారులతో కార్యాచరణ చేపట్టినట్టు అధికార వర్గాలు నుంచి వస్తున్న సమాచారం. ఆరు గ్యారెంటీల్లో ముఖ్య పథకాలైన పెన్షన్ పెంపు, గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు వంటిని అమల్లోకి తెచ్చేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ "చేయూత" పెన్షన్‌ రూ. 4వేలకు పెంచుతామని, అలాగే రూ.500 లకే గ్యాస్ సిలిండర్ ను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని హామీ ఇచ్చింది.

నిన్న (సోమవారం) సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశంలో 6 గ్యారంటీల అమలుపై ప్రభుత్వం కసరత్తు చేసింది. ఈ నెల 28 నుంచి పెన్షన్ పెంపు, రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పథకాల అమలు చేయాలని ఆలోచలనలో ఉన్నట్లు తెలుస్తోంది. మిగతా గ్యారంటీల కోసం 28నుంచి దరఖాస్తుల స్వీకరణ చేయనున్నారు. గ్రామాల్లో ప్రజాసభలు నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక చేయనుంది రాష్ట్ర సర్కార్. అయితే, పెన్షన్ పెంపుతో ఏటా రూ.11వేల కోట్ల భారం రాష్ట్ర ప్రభుత్వానికి భారం పడనుంది. 6 సిలిండర్లకు రాయితీతో రూ.2,225కోట్ల భారం పడుతున్నట్లు అధికారిక వర్గాలు అంచనా వేశాయి.

ALSO READ: పథకాల కోసం డబ్బులు లేవు.. సీఎం వీడియో వైరల్

Advertisment
Advertisment
తాజా కథనాలు