Upasana: ఒకే కుటుంబంలో ఇద్దరికీ పద్మవిభూషణ్.. మెగా కోడలు పోస్ట్ వైరల్

మెగా కోడలు ఉపాసన తన ఫ్యామిలీలో ఇద్దరికీ పద్మవిభూషణ్ వరించినందుకు ఆనందంగా ఉందంటోంది. 'ఇండియాలో ఇప్పటికి 336 మంది మాత్రమే పద్మవిభూషణ్ అందుకున్నారు. అందులో మా తాత డాక్టర్ ప్రతాప్ రెడ్డి & మామయ్య చిరంజీవి కొణిదెల ఉన్నందుకు గర్వంగా ఉంది' అని పోస్ట్ పెట్టింది.

Upasana: ఒకే కుటుంబంలో ఇద్దరికీ పద్మవిభూషణ్.. మెగా కోడలు పోస్ట్ వైరల్
New Update

PadmaVibhushan : టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి (Chiranjeevi)కి 'పద్మవిభూషణ్' (PadmaVibhushan)వరించిన విషయం తెలిసిందే. అయితే దేశంలోనే రెండో అత్యున్నతమైన అవార్డును ఆయనకు అందించబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడినప్పటి నుంచి మెగా కుటుంబ సభ్యుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. పలువురు ప్రముఖులు సైతం శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే ఈ క్రమంలోనే మెగా కోడలు ఉపాసన మరోసారి ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది.

ఆయన ఆదర్శప్రాయుడే..
ఈ మేరకు తన మామయ్యకు 'పద్మవిభూషణ్' దక్కడంపై ఇటీవలే నెట్టింట ప్రశంసలు కురిపించిన ఆమె.. 'ఐదు వేళ్లు బిగిస్తే శక్తిమంతమైన పిడికిలి ఏర్పడుతుంది. మా స్ఫూర్తిప్రదాతకు అభినందనలు. కేవలం సినిమాల్లోనే కాదు, జీవితంలోనూ ఆయన ఆదర్శప్రాయుడే. తండ్రిగా, మామయ్యగా, తాతగా ఆయన ఓ మార్గదర్శి. మా చిరుతను పద్మ విభూషణ్ పురస్కారంతో గౌరవించారు. మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తుంటాం' అంటూ పొగిడేసింది. అలాగే చిరంజీవి అంటే కేవలం సినిమాలకే పరిమితం కాలేదు.. దాతృత్వంలోనూ ఆయన ముందుంటాడు. జీవితంలో నాన్నగా, మామగారిగా, తాతగా మాకు స్ఫూర్తిని ఇచ్చాడంటూ చెప్పుకొచ్చింది.

ఇది కూడా చదవండి : Karnataka: అంబేడ్కర్ పూజకు రాలేదని విద్యార్థిపై దారుణం.. బట్టలిప్పి ఊరేగించిన స్నేహితులు

మా కుటుంబం నుంచి ఇద్దరు..
అయితే తాజాగా మరో పోస్ట్ పెట్టిన ఉపాసన.. '1.4 బిలియన్ల జనాభా ఉన్న దేశంలో ఇప్పటివరకు 336 మంది మాత్రమే పద్మవిభూషణ్ అందుకున్నారు. అందులో మా కుటుంబం నుంచి ఇద్దరున్నారు. మా తాత డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి & మా నాన్నగారి డాక్టర్ చిరంజీవి కొణిదెలను ఆశీర్వదించారు. నిజంగా గౌరవంగా ఉంది' అంటూ ట్విట్టర్ వేదికగా వీరిద్దరి ఫొటోను నెట్టింట పోస్ట్ చేసింది. దీనిపై స్పందిస్తున్న ఫ్యాన్స్ మరోసారి ప్రశంసలు కురిపిస్తున్నారు. ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి.

#padma-vibhushan #chiranjeevi #pratap-c-reddy #upasana
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి