మెగా కోడలు ఉపాసన గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చరణ్ ని పెళ్లి చేసుకోవడాని కంటే ముందుగానే ఆమె గొప్ప బిజినెస్ ఉమెన్ గా పేరు తెచ్చుకుంది. అపోలో ఆసుపత్రులను ఆమె ఒంటి చేత్తో నడిపిస్తుందని చెప్పుకోవచ్చు. చరణ్ తో పెళ్లి అయ్యి మెగా ఇంటికి కోడలిగా వచ్చిన తరువాత కూడా ఆమెలో ఎలాంటి గర్వం తొంగి చూడలేదని ఆమెను దగ్గరగా చూసిన వారు చాలా మంది చెబుతారు.
ఉపాసన మంచి భార్య, కోడలితో పాటు ఈ ఏడాది మరో కొత్త పోస్ట్ ని కూడా ఆమె స్వీకరించింది. అదే అమ్మ పోస్ట్. ఆమె తన ముద్దుల కూతురు క్లీంకారతో ఎక్కువ సమయం గడుపుతూ అమ్మతనాన్ని ఆస్వాదిస్తుంది. చరణ్ వ్యాపారాల్లో అతని వెన్నంటే ఉండి నడిపిస్తోంది.
చరణ్ కూడా ఏ మాత్రం ఖాళీ దొరికన భార్య , బిడ్డలతో గడపడానికే చూస్తున్నాడు.
చరణ్ కూడా నిత్యం ఉపాసన కు తోడుంటూ..ఆమె వ్యాపారాల్లో ఆమెకు అండగా నిలబడతాడనే విషయాన్ని ఉపాసన పలు ఇంటర్వ్యూల్లో పేర్కొన్నారు కూడా. ఉపాసన ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు చరణ్ తన సినిమా షూటింగ్ లకు కూడా బ్రేక్ ఇచ్చి మరి ఉపాసనతో ఉన్నాడు. ఆమెను ప్రతి సంవత్సరం విదేశాలకు తీసుకుని వెళ్తుంటాడు.
కొద్ది రోజుల క్రితం ఉపాసన చరణ్ ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజీ పై మెరిశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ జంటకి ఇలాంటి గౌరవం దక్కలేదు. ఈ క్రమంలోనే చరణ్, ఉపాసన ఎన్నో విషయాలను ఆ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తాజాగా ఈ కవర్ పేజీ గురించి ఉపాసన ట్వీట్ చేసింది.
“ప్రతి మగవాడి విజయం వెనుక ఓ ఆడది ఉంటుందని అందరూ అంటుంటారు. నేనేమంటానంటే.. ప్రతి మహిళ విజయం వెనుక ఆమెకు అండగా, రక్షణగా నిలబడే ఒక మగవాడు ఉంటాడు” అంటూ రామ్ చరణ్ ను ట్యాగ్ చేసింది.
ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ట్వీట్ చూసిన అభిమానులు సూపర్ మేడమ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
Also read: నాకు టికెట్ కన్ఫామ్.. వారందరికీ ఎమ్మెల్సీ, కార్పొరేషన్ పోస్టులు: ఎంపీ భరత్ సంచలన ప్రకటన