MP Bharath: నాకు టికెట్ కన్ఫామ్.. వారందరికీ ఎమ్మెల్సీ, కార్పొరేషన్ పోస్టులు: ఎంపీ భరత్ సంచలన ప్రకటన ఈసారి ఎన్నికల్లో రాజమండ్రి ఎమ్మెల్యే టికెట్ కావాలని సీఎం జగన్ ను కోరానని ఎంపీ భరత్ వెల్లడించారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం నాకు అవకాశం ఇస్తున్నారని తెలిపారు. By Bhavana 28 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి నాకు టికెట్ కన్ఫామ్.. వారందరికీ ఎమ్మెల్సీ, కార్పొరేషన్ పోస్టులు: ఎంపీ భరత్ సంచలన ప్రకటన ఏపీలో ఎన్నికల వేడి ఊపందుకుంది. ఇప్పటికే ప్రతిపక్ష నాయకులు ప్రశాంత్ కిషోర్ ని రంగంలోకి దించితే..ఏపీ సీఎం జగన్ తన ఎత్తులు తాను వేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ది కోసం ఎమ్మెల్యే, ఎంపీ సీట్లను మార్చుతున్నట్లు ఆయన ఇప్పటికే ప్రకటించారు. చాలా చోట్ల సీట్లు రాని ఎమ్మెల్యేలు, ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ జగన్ కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కూడా. కొందరైతే పక్క పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. మరికొంత మంది ఎన్నికలకు దూరంగా ఉంటామని ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో ఏ నిమిషానికి ఏం జరుగుతుందో అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో జగన్ ని కొందరు కలిసి తమ డిమాండ్లను ఆయన ముందు పెడుతున్నారు. ఈ క్రమంలోనే రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ గురువారం ఆసక్తికర వ్యాఖ్యాలు చేశారు. ఆయన ఈరోజు తాడేపల్లి క్యాంపు ఆఫీసులో జగన్ ని కలిశారు. మొత్తం 175 సీట్లు గెలిచేందుకు కృషి చేయాలి సీఎం జగన్ సూచించారని వెల్లడించారు. గెలుపు కోసమే ఇన్ఛార్జీల మార్పులు అని ఆయన వివరించారని తెలిపారు. సీట్లు దక్కని వారికి ఎమ్మెల్సీ, కార్పొరేషన్ అవకాశాలు ఇస్తారని పేర్కొన్నారు. ఈసారి ఎన్నికల్లో రాజమండ్రి ఎమ్మెల్యే టికెట్ కావాలని సీఎం జగన్ ను కోరానని ఎంపీ భరత్ వెల్లడించారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం నాకు అవకాశం ఇస్తున్నారు... రాజమండ్రి ఎంపీ సీటు ఈసారి కూడా బీసీ అభ్యర్థికే ఇస్తున్నారు అని వివరించారు. Also read: అయోధ్యలో మాంసం, మద్యం అమ్మకాలు బంద్..యోగి ప్రభుత్వం ఆదేశాలు! #mp-bharat #jagan #ycp మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి