అంబులెన్స్‌ లేక చనిపోయిన చెల్లిని బండి మీద తీసుకెళ్లిన అన్న!

యూపీలో అంబులెన్స్‌ లేక చెల్లి మృతదేహాన్ని బైక్‌ మీద తీసుకుని వెళ్లాడు ఆమె సోదరుడు. నిన్నటికి నిన్న అంబులెన్స్‌ లేక కూరగాయల (తోపుడు) బండి మీద తీసుకెళ్లిన ఘటన మరువక ముందే మరో దారుణ ఘటన చోటు చేసుకుంది.

అంబులెన్స్‌ లేక చనిపోయిన చెల్లిని బండి మీద తీసుకెళ్లిన అన్న!
New Update

దేశం బాగుపడింది..మేము వచ్చిన తరువాత ముందుకు వెళ్తుంది అని చెప్పుకుంటున్న రాజకీయ నాయకులంతా కూడా ఈ వీడియో చూసి సమాధానం చెప్పాలి. చనిపోయిన వారిని తరలించడానికి కనీసం అంబులెన్సులు కూడా లేకపోవడం అనేది దేశానికి పట్టిన దౌర్భాగ్యంగా చెప్పుకోవాలి.

కళ్ల ముందే తోడబుట్టిన చెల్లెలు చనిపోతే ఆ అన్న పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఊహించక్కర్లేదు. అలాంటిది కనీసం ఆ చెల్లెల్ని తరలించడానికి అంబులెన్స్‌ కూడా లేకపోతే..ఇక ఆ తోబుట్టువు పరిస్థితి ఎలా ఉంటుందో మాటల్లో వర్ణించలేం.ఆస్పత్రిలో అతని రోదనలు.. దద్దరిల్లయ్యాయి.

ఈ దారుణమైన సంఘటన ఉత్తరప్రదేశ్ లోని ఔరయాలోని బిధునా కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లో బుధవారం నాడు జరిగింది. నీళ్ల హీటర్‌ పెట్టుకున్న ఓ యువతి ప్రమాదవ శాత్తు విద్యుదాఘాతానికి గురైంది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే బిధువా కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ కు తరలించారు.

Also read: అదిరిపోయే దీవాళి ఆఫర్.. ఆ కార్లపై ఏకంగా రూ.లక్ష డిస్కౌంట్!

కానీ అప్పటికే యువతి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కానీ ఆ యువతి అన్న మాత్రం ఇంకా తన చెల్లి బతికే ఉందన్న ఆశతోనే ఉన్నాడు. అందుకే ఇంకో ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించాడు. కానీ అంబులెన్స్‌ లేదు.దీంతో చెల్లెలి మృతదేహాన్ని మరో ఆసుపత్రికి తరలించేందుకు బైక్‌ పై తీసుకుని వెళ్లేందుకు ప్రయత్నించాడు.

ఆ సమయంలో ఆ యువకుడి రోదనలు చూసిన వారికి ఎవరికైనా కన్నీళ్లు పెట్టించాయి. ఉత్తర్ ప్రదేశ్‌ లో ఆరోగ్య వ్యవస్థ అధ్వాన్నంగా ఉందో తెలపడానికి ఈ ఘటనే సాక్ష్యం. ప్రజలు తమ బంధువులు చనిపోయిన లేదా అనారోగ్యంతో ఉన్న బంధువులను బండ్ల మీద కూరగాయల తోపుడు బండి మీద తీసుకెళ్లిన సంఘటనలు వెలుగు చూశాయి.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ప్రతిపక్ష కాంగ్రెస్ నేత ఒకరు షేర్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో యూపీ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

#ambulance #dead-body #bike #uttarapradesh
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe