WPL: గుజరాత్ కు మూడోసారి ఎదురుదెబ్బే..యూపీ వారియర్స్ గెలుపు..! మహిళల ప్రీమియర్ లీగ్ గుజరాత్ కు కలిసిరావడం లేదు. శుక్రవారంజరిగిన గ్రూప్ దశ మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్ పై యూపీ వారియర్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గుజరాత్ జెయింట్స్ నిర్దేశించిన 143 పరుగుల లక్ష్యాన్ని యూపీ వారియర్స్ మరో 26 బంతులు మిగిలి ఉండగానే పూర్తి చేసింది. By Bhoomi 01 Mar 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి WPL: మహిళల ప్రీమియర్ లీగ్ గుజరాత్ కు కలిసిరావడం లేదు. శుక్రవారంజరిగిన గ్రూప్ దశ మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్ పై యూపీ వారియర్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయింది. 142 పరుగులు మాత్రమే చేసింది. ఆష్ లైగ్ గార్డనర్ 30, ఫోబే లిచ్ ఫీల్డ్ 35 , లారా వోల్వార్డ్ 28 పరుగులు చేయగా..యూపీ బౌలర్లలో సోఫీ ఎలకెల్ స్టోన్ 3, రాజేశ్వరి గైక్వాడ్ 1 వికెట్ తీసుకున్నారు. గుజరాత్ జెయింట్స్ నిర్దేశించిన 143 పరుగుల లక్ష్యాన్ని యూపీ వారియర్స్ మరో 26 బంతులు మిగిలి ఉండగానే పూర్తి చేసింది. 4 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. ఓపెనర్ ఆల్యేశా హేలీ 33 పరుగులు చేసి బ్రైస్ బౌలింగ్ లో బౌల్డ్ అయి పెవిలియన్ కు చేరింది. మరో ఓపెనర్ కిరణ్ నావ్ గిర్ 12, చామారి ఆటపట్టు 17 పరుగులు చేసి పెవిలియన్ కు చేరారు. తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన గ్రేస్ హారిస్ 60 పరుగులు చేయగా..గుజరాత్ బౌలర్లు తనూజా కన్వర్ రెండు క్యాత్రిన్ బ్రైస్, మేఘనా సింగ్ ఒక్కో వికెట్ తీశారు. No cricket fans will scroll down without liking this video❤️ Our 2nd consecutive victory🤩🤩#UPWvGGW #WPL2024 #UPWvGG pic.twitter.com/iBNHA8Pi3E — UP Warriorz #UPW (@UPWarriorzWPL) March 1, 2024 ఇది కూడా చదవండి: ప్యార్ హువా ఇక్రార్ హువాకి అంటూ ప్రీ వెడ్డింగ్ లో అంబానీ దంపతుల అదిరిపోయే డ్యాన్స్…!! #telugu-news #wpl-2024 #gujarat-giants #up-warriors మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి