త్తరప్రదేశ్‌లోని మీరట్‌లో విషాదం చోటుచేసుకుంది. తల్లితో కలిసి ఉండటం ఇష్టం లేక ఓ బాలిక ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. భర్త చనిపోయిన ఓ మహిళ తన 17 ఏళ్ల కూతురు, 8 ఏళ్ల కొడుకుతో కలిసి మీరట్‌లో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఇంతకు ముందు ఆ కుటుంబం వేరే ఇంట్లో ఉండేది. ఈ ఏడాది జనవరి 8న ప్రస్తుతం ఉంటున్న ఇంట్లోకి మారింది. కానీ ఆ బాలిక ఇంట్లో తల్లి, తమ్ముడు లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
Also Read: కాంగ్రెస్ హయాంలో రూ.12 లక్షల కోట్లు దోపిడీ చేశారు: కిషన్ రెడ్డి
సమాచారం మేరకు ఘటనాస్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం హాస్పిటల్‌కు పంపించారు. అయితే సూసైడ్ చేసుకున్న ఆ బాలిక చాలాకాలంగా తన తమ్ముడితో కలిసి ముజఫర్‌వనగర్‌లోని తన మేనత్త ఇంట్లో ఉండేది. అయితే 2020లో ఓ యువకుడు ఆ బాలికపై అత్యాచారం చేశాడు. దీంతో ఆ సమయంలో పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేసి జైలుకు తరలించారు.
అయితే కొన్ని రోజుల క్రితం ఆ బాలిక తల్లి.. ఆమెను, తన తమ్ముడిని మేనత్త ఇంటి నుంచి బలవంతంగా తీసుకొచ్చినట్లు పోలీసులు తమ విచారణలో తెలిపారు. ఆ బాలిక మేనత్త దగ్గరే ఉంటానని చెప్పినా కూడా తల్లి ఇందుకు ఒప్పులేదని చెప్పారు. దీంతో తల్లి దగ్గర ఉండటం ఇష్టం లేకే ఆ బాలిక సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Also read: భార్యను 12ఏళ్లు బంధించిన భర్త.. బాక్స్ లో మలమూత్రాలు, కిటికీలోంచి ఫుడ్