Amith Shah: ఎన్నికల్లో టికెట్‌ కావాలంటే డబ్బులు పంపాలి.. అమిత్‌ షా పేరుతో మోసం!

ఓ మోసగాడు మాజీ ఎమ్మెల్యేకు ఫోన్‌ చేసి అమిత్‌ షాను మాట్లాడుతున్నానని పేర్కొన్నాడు.మాజీ ఎమ్మెల్యే ఆయనతో కాసేపు సంభాషించిన తరువాత ఆ మోసగాడు టికెట్‌ కావాలంటే డబ్బులు పంపాలని తెలిపాడు.దీంతో అనుమానం వచ్చిన మాజీ ఎమ్మెల్యే వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

Amith Shah: ఎన్నికల్లో టికెట్‌ కావాలంటే డబ్బులు పంపాలి.. అమిత్‌ షా పేరుతో మోసం!
New Update

Amith Shah: మరికొద్ది రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు (Loksabha Elections) రానున్నాయి. ఈ క్రమంలో రాజకీయాల్లో హీట్‌ పెరగడంతో పాటు పార్టీలో టిక్కెట్లు అడిగే వారి సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోంది. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీ(BJP) కి ఈ టికెట్ల తాకిడి ఎక్కువగా ఉంది. ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు బీజేపీ అగ్రనేతలను దువ్వడం మొదలు పెట్టారు.

సిఫార్సుల రౌండ్ కూడా ప్రారంభమైంది.దీనిని ఆసరాగా చేసుకున్న కొందరు మోసగాళ్లు(Thug)  క్యాష్‌ చేసుకోవాలని రంగంలోకి దిగారు. ఉత్తర్‌ ప్రదేశ్‌ లో ఇలాంటి సంఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ మోసగాడు మాజీ ఎమ్మెల్యేకు ఫోన్‌ చేసి అమిత్‌ షా(Amith Shah) ను మాట్లాడుతున్నానని పేర్కొన్నాడు. నిజమని నమ్మిన మాజీ ఎమ్మెల్యే ఆయనతో కాసేపు సంభాషించిన తరువాత ఆ మోసగాడు టికెట్‌ కావాలంటే డబ్బులు పంపాలని తెలిపాడు.

దీంతో అనుమానం వచ్చిన మాజీ ఎమ్మెల్యే వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కేసులో పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు. ఈ విషయమై అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (రూరల్ ఏరియా) ముఖేష్ చంద్ర మిశ్రా మాట్లాడుతూ బరేలీలోని నవాబ్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్ వినోద్ కుమార్ తరపున కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా లాగా నటిస్తూ ఓ ముఠా సభ్యులు టిక్కెట్‌ ఇప్పిస్తామంటూ రాజకీయ నాయకులను ఫోన్‌లో మోసం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. నవాబ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రూపా గ్రామానికి చెందిన రవీంద్ర మౌర్య, మాజీ ఎమ్మెల్యే కిషన్ లాల్ రాజ్‌పుత్‌తో జనవరి 4, జనవరి 20, తేదీల్లో తొమ్మిది సార్లు ఫోన్‌లో మాట్లాడినట్లు విచారణలో తేలిందని ఆయన చెప్పారు.

కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను అనుకరిస్తూ మాట్లాడినట్లు, మాజీ ఎమ్మెల్యేకి టికెట్‌ ఇప్పిస్తానని ప్రలోభపెట్టి డబ్బులు దండుకునే ప్రయత్నం చేశారని చెప్పారు. ట్రూ కాలర్ యాప్‌లోని నంబర్‌ను తనిఖీ చేయగా, కేంద్ర హోం మంత్రి, కేంద్ర ప్రభుత్వం పేరిట ఐడీ కనిపించింది.

పోలీసులు రంగంలోకి దిగినట్లు తెలుసుకున్న రవీంద్ర సిమ్‌ ని నాశనం చేసినట్లు మిశ్రా పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యేకు ఫోన్ చేసిన నంబర్ రవీంద్ర గ్రామానికి చెందిన హరీష్ అనే వ్యక్తి ఐడీలో నమోదైందని తెలిపారు. ఈ కేసులో హరీష్‌ను అదుపులోకి తీసుకున్నామని.. విచారణలో, అతను డిసెంబర్ 29, 2023న తన ఐడీపై ఈ సిమ్‌ను కొనుగోలు చేసినట్లు పోలీసులకు చెప్పాడు.

ఆ తర్వాత గ్రామానికి చెందిన రవీంద్ర మౌర్య, షాహిద్‌లు అతడిని బెదిరించి సిమ్‌ తీసుకెళ్లినట్లు హరీష్‌ పోలీసులకు తెలిపాడు. ప్రస్తుతం రవీంద్ర, షాహిద్ కోసం పోలీసులు వెతుకుతున్నారని మిశ్రా తెలిపారు. ఎవరికైనా ఇలాంటి మోసపూరిత కాల్ వస్తే వెంటనే పోలీసులను సంప్రదించాలని తెలిపారు.

Also read: భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చిన రైతు సంఘాలు.. 144 సెక్షన్‌ అమలు!

#amith-shah #ex-mla #ticket #uttarpradesh #thug
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe