Free Electricity : ఈ ఒక పనిచేస్తే చాలు..రైతులకు ప్రతినెలా 1045 యూనిట్ల ఫ్రీ విద్యుత్..!

రైతుల విషయంలో యూపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. యూపీలో ప్రభుత్వం రైతులకు గొట్టపు బావులకు ఫ్రీ విద్యుత్ అందిస్తోంది. ఈ మేరకు యూపీ పవర్ కార్పొరేషన్ నుంచి ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి.

New Update
Free Electricity : ఈ ఒక పనిచేస్తే చాలు..రైతులకు ప్రతినెలా 1045 యూనిట్ల ఫ్రీ విద్యుత్..!

Free Electricity :  రైతన్నల కష్టం చెబితే అర్థమయ్యేది కాదు.ఒక ఏడాది వర్షాలు పడకపోతే..పంట చేతికి వచ్చే సమయానికి అకాలు వర్షాలు పడితే..అన్నదాతలు అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారు.ప్రభుత్వాలు ఒక్కరిద్దరికి సాయం చేసి చేతులు దులుపుకునే పరిస్థితులు ఎన్నో చూశాం. అయితే యూపీ సర్కార్ మాత్రం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో రైతులకు ఊరట లభించనుంది. సాగునీటి కోసం ప్రైవేట్ గొట్టపు బావుల కనెక్షన్లపై రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తోంది. ఈ మేరకు యూపీ పవర్ కార్పొరేషన్ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అంటే ఇప్పుడు రైతులకు సాగునీటికి ఉచిత విద్యుత్ అందుతుంది.

నీటిపారుదల స్కీం కింద బుందేల్‌ఖండ్ రైతులకు నెలకు 1300 యూనిట్లు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల రైతులకు నెలకు 1,045 యూనిట్ల ఉచిత విద్యుత్ అందుతుంది. మార్చి 31, 2023లోపు మొత్తం విద్యుత్ బిల్లును చెల్లించిన రైతులకు ఇది వర్తిస్తుంది. వారు మాత్రమే ఈ పథకం ప్రయోజనం పొందుతారు.చాలా కాలంగా బిల్లులు బకాయి ఉన్న రైతులు.. ఇందుకోసం ప్రభుత్వం వడ్డీ మాఫీ పథకాన్ని కూడా అమలు చేస్తోంది. దీని ప్రయోజనాలను పొందడానికి, రైతులు జూన్ 30, 2024లోగా నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ సమయంలో బకాయి ఉన్న బిల్లులో 30 శాతం డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మీరు మిగిలిన మొత్తాన్ని ఒకేసారి లేదా వాయిదాలలో డిపాజిట్ చేయవచ్చు. మీరు ఒకేసారి డిపాజిట్‌పై 100 శాతం వడ్డీ రాయితీని పొందుతారు. అదే సమయంలో, బకాయిలను మూడు విడతలుగా జమ చేస్తే 90 శాతం వడ్డీ రాయితీ, ఆరు వాయిదాలలో డబ్బు జమ చేస్తే 80 శాతం వడ్డీ రాయితీ ఉంటుంది.

-ఫ్రీ విద్యుత్ పథకం ప్రయోజనం పొందడానికి, రైతులు తప్పనిసరిగా మీటర్ లేదా కనెక్షన్ పొందాలి.

-ఉచిత విద్యుత్ పథకం కోసం కూడా KYC చేయాల్సి ఉంటుంది. మిగతా అన్ని కనెక్షన్ల వివరాలను ఇందులో ఇవ్వాల్సి ఉంటుంది.

-ఈ కనెక్షన్‌లో గొట్టపు బావిని మాత్రమే ఆపరేట్ చేయవచ్చు. గృహోపకరణాలలో ఒక ఫ్యాన్, ఒక ఎల్ఈడీ బల్బు మాత్రమే ఉండాలి.

-మార్చి 31, 2023 వరకు అన్ని చెల్లింపులను క్లియర్ చేసిన తర్వాత మాత్రమే పథకం ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి.

ఇది కూడా చదవండి:  రిటైర్మెంట్ ఎప్పుడో చెప్పేసిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ..!

Advertisment
తాజా కథనాలు