సీనియర్ నటి, బీజేపీ నేత జయప్రద (Jayaprada) కు గత కొద్ది రోజుల నుంచి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఆమెకు ఏదోక విధంగా కోర్టు నుంచి అక్షింతలు పడుతూనే ఉన్నాయి. గత నెలలో ఓ కేసులో వెంటనే కోర్టులో లొంగిపోవడంతో పాటు..20 లక్షలు డిపాజిట్ చేయాలని కోర్టు నోటీసులు ఇచ్చింది.
తాజాగా మరో కేసులో యూపీ కోర్టు (UP court) నాన్ బెయిలబుల్ (Non - Bailable ) వారెంట్ జారీ చేసింది. ఆమె గత ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించినందుకు ఆమెకు కోర్టు నోటీసులు ఇచ్చింది. 2019 లో లోక్ సభ ఎన్నికల ప్రచారం సమయంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించినందుకు యూపీ జిల్లాలోని కోర్టు శుక్రవారం నాన్ బెయిల్‌బుల్ వారెంట్ జారీ చేసింది.
నటి కోర్టుకు హాజరు కాకపోవడంతో ఆమె పై జారీ చేసిన వారెంట్ అమలులో ఉంటుందని స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ శోభత్ బన్సల్ తెలిపారని ప్రాసిక్యూటర్ అధికారి నీరజ్ కుమార్ వివరించారు. ఇలా కోర్టు వారెంట్ ను కొనసాగించడం ఇది నాలుగో సారి. దీని గురించి తరువాత విచారణ నవంబర్ 24న ఉండనుంది.
ఈ కేసు గురించి జయప్రద కోర్టుకు హాజరు కాకపోవడంతో పాటు ఎటువంటి సమాధానం కూడా ఇవ్వడం లేదు. దీంతో పోలీసులు జయప్రదను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచవచ్చని నీరజ్ కుమార్ అన్నారు. 2019 ఎన్నికలో ప్రచారంలో జయప్రద పై స్వర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
ఇది రాంపూర్ ఎంపీ ఎమ్మెల్యే కోర్టులో ఇది ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉంది. జయప్రద 2019 లోక్ సభ ఎన్నికల్లో రాంపూర్ నుంచి బీజేపీ
నుంచి పోటీ చేశారు. . ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిన తర్వాత అక్కడ ఒక రహదారిని ప్రారంభించినందుకు ఆమెపై కేసు నమోదైంది.
గత నెలలో జయప్రదను 15 రోజుల్లోగా కోర్టులో లొంగిపోవాలంటూ మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా 20 లక్షల రూపాయలను కూడా డిపాజిట్ చేయాలని తీర్పునిచ్చింది. ఉద్యోగులకు ఈఎస్ ఐ చెల్లింపులో అవకతవకల కేసులో జయప్రద మీద కేసు నమోదు అయ్యింది. ఈ క్రమంలోనే తనకు విధించిన జైలు శిక్షను రద్దు చేయాలంటూ నటి కోర్టును ఆశ్రయించారు.
కేసు పూర్వాపరాలను పరిశీలించిన తరువాత మద్రాసు హైకోర్టు పై విధంగా తీర్పునిచ్చింది. కొంతకాలం క్రితం జయప్రద చెన్నైకి చెందిన రామ్ కుమార్, రాజ్ బాబు అనే వ్యక్తులతో కలిసి తమిళనాడులోని అన్నాసాలైలో ఓ థియేటర్ ను ఏర్పాటు చేసి నిర్వహించారు. ఆ థియేటర్ లో చాలా మంది ఉద్యోగులు పని చేసేవారు.
వారందరికీ ఈఎస్‌ఐ లు చెల్లించడంలో జయప్రదతో పాటు, రామ్ కుమార్, రాజ్ బాబు ముగ్గురు కూడా అవకతవకలకు పాల్పడినట్లు కేసు నమోదు అయ్యింది. దీని గురించి ఎగ్మూర్ కోర్టులో కేసు దాఖలైంది. ఆ సమయంలో జయప్రదతో పాటు మిగిలిన ఇద్దరికి కూడా ఆరు నెలల జైలు శిక్ష విధించడంతో పాటు రూ. 5 వేల జరిమానా విధిస్తూ ఆగస్టులో తీర్పును చెప్పింది.
Also read: వాళ్లంతా బచ్చాగాళ్లు..పటాన్ చెరులో ఎగిరేది గులాబీ జెండా…గూడెం మహిపాల్ రెడ్డి షాకింగ్ కామెంట్స్…!!