Madhya Pradesh : భార్యతో అసహజ శృంగారం నేరం కాదు : హైకోర్టు

భర్త.. భార్యతో చేసే అసహజ శృంగారం రేప్ కాదని మధ్యప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. తన భర్త అసహజ శృంగారం చేస్తున్నట్లు ఓ మహిళ కోర్టును ఆశ్రయించగా.. దీనిపై విచారించిన న్యాయస్థానం ఈ కేసును కొట్టివేసింది.

Madhya Pradesh : భార్యతో అసహజ శృంగారం నేరం కాదు : హైకోర్టు
New Update

High Court : భర్త(Husband).. భార్య(Wife) తో చేసే అసహజ శృంగారం(Un Natural Sex) రేప్ కాదని మధ్యప్రదేశ్ హైకోర్టు(Madhya Pradesh High Court) స్పష్టం చేసింది. తన భర్త అసహజ శృంగారం చేస్తున్నట్లు ఓ మహిళ కోర్టును ఆశ్రయించగా.. దీనిపై విచారించిన న్యాయస్థానం ఈ కేసును కొట్టివేసింది. చట్టం ప్రకారం ఇది నేరం కాదని.. ఎందుకంటే ఆమె ఆయన్ని పెళ్లి చేసుకున్నట్లు ఆ ఆదేశాల్లో కోర్టు పేర్కొంది. పెళ్లాడిన భార్యతో అసహజ శృంగారం చేయడం ఐపీసీలోని సెక్షన్ 377 ప్రకారం నేరం కాదని, దీనిపై మరింత సంప్రదింపులు అవసరం లేదని.. భార్య నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టిపారేస్తున్నట్లు కోర్టు చెప్పింది.

Also Read: రోహిత్ వేముల సూసైట్‌ నోట్‌లో ఏముంది..

జ‌స్టిస్ జీఎస్ అహ్లువాలియా నేతృత్వంలోని ఏక‌స‌భ్య ధ‌ర్మాస‌నం ఈ తీర్పును వెలువరించింది. బుధ‌వారం వెలువడ్డ ఈ ఆదేశాలను గురువారం వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. వైవాహిక బంధంలో రేప్‌కు గుర్తింపు లేద‌ని.. జ‌బ‌ల్‌పుర్ పోలీసు స్టేష‌న్‌లో న‌మోదు అయిన కేసును ర‌ద్దు చేస్తున్నట్లు పేర్కొంది.

Also Read: సింగర్ నల్గొండ ‘గద్దర్ నర్సన్న' ఫేస్ బుక్ హ్యాక్ ?

#telugu-news #national-news #un-natural-sex #madhya-pradesh-high-court
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe