Breaking : సింగర్ నల్గొండ 'గద్దర్' నర్సన్నఫేస్ బుక్ హ్యాక్?

ప్రముఖ తెలంగాణా సుప్రసిద్ద గాయకుడు నల్గొండ గద్దర్ నర్సన్న ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయింది. ఎవరో గుర్తుతెలియని వాళ్ళు అయన అకౌంట్ ని హ్యాక్ చేసారు.

New Update
Breaking : సింగర్ నల్గొండ 'గద్దర్' నర్సన్నఫేస్ బుక్ హ్యాక్?

Singer Nalgonda Gaddar Narsanna Face Book Hack :  ఈ రోజుల్లో సోషల్ మీడియా(Social Media) అకౌంట్ లేని వాళ్ళు లేరు. సామాన్యుల నుంచి సినీ, రాజకీయ ప్రముఖుల వరకు అందరూ సోషల్ మీడియాని వాడుతున్నారు. ఇక సెలెబ్రిటీల విషయంలో ఈ సోషల్ మీడియా ప్లాట్ పామ్స్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.

ఐతే వీటి వాళ్ళ కొన్నిసార్లు సెలెబ్రెటీ లకు తిప్పలు తప్పడం లేదు. ముఖ్యంగా కొందరు హ్యాకర్స్ సెలెబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్స్ ని హ్యాక్(Hack) చేస్తున్నారు. ఈ మధ్య ఇది బాగా ఎక్కువైంది. తాజాగా ప్రముఖ తెలంగాణా సుప్రసిద్ద గాయకుడు నల్గొండ గద్దర్ నర్సన్న(Narsanna) ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయింది.

Also Read : రోహిత్ వేముల సూసైట్‌ నోట్‌లో ఏముంది..

ఎవరో గుర్తుతెలియని వాళ్ళు అయన అకౌంట్ ని హ్యాక్ చేసారు. అయన పేస్ బుక్(Facebook) లో ఇతర పోస్ట్ లు కనిపించడంతో ఈ విషయం కాస్త బయటపడింది. కాగా నల్గొండ గద్దర్ నరసన్న పేస్ బుక్ అకౌంట్ ని ఎవరు హ్యాక్ చేశారు? ఎందుకు చేశారు? తదితర వివరాలు తెలియాల్సి ఉంది.

ఇక సింగర్ నర్సన్న విషయానికొస్తే.. రాజకీయ నాయకులపై ఆయన పాడిన పాటలు ఎంతగానో పాపులర్ అయ్యాయి. ముఖ్యంగా YS జగన్(YS Jagan), రేవంత్ రెడ్డి(Revanth Reddy) లపై ఆయన పాడిన పాటలు యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ అందుకున్నాయి. పొలిటికల్ సాంగ్స్ తో పాటూ తెలంగాణా జానపద ఇతర పాటలు పాడి నల్గొండ గద్దర్ నర్సన్న గా సోషల్ మీడియాలో భారీ క్రేజ్ తెచ్చుకున్నాడు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు