Crime:స్నేహితుడితో అసహజ శృంగారం.. నగరం నడిబొడ్డున యువకుడి దారుణ హత్య

స్నేహితుడితో అసహజ శృంగారం కోసం పాకులాడిన ఓ యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌ కు చెందిన ప్రమోద్‌ కుమార్‌ శుక్లా అనే యువకుడు శృంగారంలో పాల్గొనాలని ఒత్తిడి చేసినందుకు హతమార్చినట్లు బిహార్‌కు చెందిన రాజేశ్‌ తెలిపాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

New Update
Crime:స్నేహితుడితో అసహజ శృంగారం.. నగరం నడిబొడ్డున యువకుడి దారుణ హత్య

Unnatural romance: రోజు రోజుకు కామాంధులు రెచ్చిపోతున్నారు. స్త్రీ, పురుషులనే తేడా లేకుండా శృంగార వాంఛ తీర్చుకునేందుకు తహతహలాడుతున్నారు. ఇటీవలే అసహజ శృంగారం కోసం ఇంట్లో భార్యను టార్చర్ చేసిన ఓ భర్త పురుషాంగం ఇల్లాలు కొరికేసిన ఘటన మరవకముందే మరో దారుణం వెలుగుచూసింది. కొంతకాలంగా కలిసివుంటున్న స్నేహితుడితో అసహజ సంభోగానికి పాల్పడ్డ యువకుడిని దారుణంగా హతమార్చిన ఘటన దేశ రాజధానిలో సంచలన రేపింది.

నైట్‌ షెల్టర్‌లో..
ఈ మేరకు పోలీసులు, యువకుల సన్నిహితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ ఘటన ఉత్తర ఢిల్లీలో ఈ జనవరి 17న జరగగా జనవరి 19న వెలుగులోకి వచ్చింది. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని జలాన్‌ జిల్లాకు చెందిన ప్రమోద్‌ కుమార్‌ శుక్లా.. ఢిల్లోలో ఓ మండిలోని ఓ దుకాణంలో పనిచేసేవాడు. అయితే మరొక యువకుడితో అక్కడే నైట్‌ షెల్టర్‌లో ఉంటున్నాడు. ఈ క్రమంలోనే జనవరి 19న ఢీల్లీలోని మోరీ గేట్‌కు దగ్గరలోని డీడీఏ పార్క్‌ వద్ద గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్లు స్థానికుల నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చింది. ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించగా మృతుడి శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చదవండి :PFI : బీజేపీ నేత హత్య.. 15మందికి మరణశిక్ష.. కేరళ కోర్టు సంచలన తీర్పు!

శృంగారంలో పాల్గొనాలని ఒత్తిడి..
ఈ దర్యాప్తులో భాగంగా స్థానికంగా ఉన్న 50 సీసీ కెమెరా ఫుటేజ్‌లను పరిశీలించగా మృతుడు ఉత్తర్‌ ప్రదేశ్‌లోని జలాన్‌ జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. తలపై బండ రాయితో మోదడంతో సదరు యువకుడు ఘటనాస్థలంలోనే మృతిచెందాడు. అయితే ఈ దారుణానికి పాల్పడ్డ నిందితుడు బిహార్‌కు చెందిన రాజేశ్‌గా పోలీసులు గుర్తించారు. హత్య చేసి పారిపోయిన అతన్ని పట్నాలో అదుపులోకి తసుకుని దర్యాప్తు చేయగా విషయం బయటకు వచ్చింది. తనను శుక్లా అసహజ శృంగారంలో పాల్గొనాలని ఒత్తిడి చేసేవాడని నిందితుడు చెప్పాడు. దీంతో అతడిని హత్య చేసేందుకు ప్రణాళిక వేసుకుని హత్య చేసినట్లు రాజేశ్‌ పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Advertisment