Baltimore Bridge Accident : వంతెన నిర్మాణం కోసం నిధులు విడుదల చేసిన అమెరికా..

అమెరికాలోని బాల్టిమోర్‌లో పెటాప్కో నదిపై నౌక ఢీకొనడంతో వంతెన కూలిపోయిన సంగతి తెలిసిందే. ఆ బ్రిడ్జిని మళ్లీ నిర్మించేందుకు ఫెడరల్‌ ప్రభుత్వం ప్రాథమికంగా 60 మిలియన్ డాలర్లు (రూ.450కోట్లు) విడుదల చేసింది. దీంతో త్వరలోనే అక్కడ వంతెన నిర్మాణం పనులు చేపట్టనున్నారు.

New Update
Baltimore Bridge Accident : వంతెన నిర్మాణం కోసం నిధులు విడుదల చేసిన అమెరికా..

ఇటీవల అమెరికా(America) లోని బాల్టిమోర్‌లో పెటాప్కో నదిపై ఉన్న వంతెనను రవాణా సరకు నౌక ఢీకొనడంతో ఆ బ్రిడ్జి కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ వంతెన పునర్నిర్మాణం కోసం ఫెడరల్‌ ప్రభుత్వం(Federal Government) ప్రాథమికంగా 60 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.480 కోట్ల నిధులు విడుదల చేసింది. వంతెన నిర్మాణం కోసం మేరీలాండ్‌ గవర్నర్‌ వెస్‌మూర్‌ కోరిన వెంటనే ఈ నిధులను దేశ రవాణా, హైవే మంత్రిత్వ శాఖ మేరీలాండ్ రాష్ట్రానికి నిధులు కేటాయించింది.

Also Read : కాంగ్రెస్ ఖాతాలు ఫ్రీజ్‌, కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించిన ఐక్యరాజ్యసమతి

త్వరలో నిర్మాణ పనులు 

అయితే ఈ నిధులను నదిలో పడిపోయిన వంతెన శిథిలాలను తొలగించడం, అలాగే వంతెన మళ్లీ నిర్మించడం లాంటి పనులకు వినియోగించనున్నారు. కీలకమైన బాల్టిమెర్‌ వంతెన(Baltimore Bridge) ను త్వరగా మళ్లీ నిర్మించడం కోసం చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశిచ్చినట్లు అమెరికా అధ్యక్షుడు ఇప్పటికే మీడియాతో వెల్లడించారు. రవాణా సరకు నౌకలో ఉన్న భారత సిబ్బంది.. ప్రమాదానికి ముందు అధికారలను అప్రమత్తం చేయడంతో భారీ ప్రాణనష్టం తప్పిందంటూ వారిపై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే త్వరలోనే వంతెన నిర్మాణ పనులు మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది.

ఇద్దరి మృతదేహాలు లభ్యం

ఇదిలా ఉండగా.. మంగళవారం (మార్చి25)న పటాప్కో నదిపై ఉన్న ఫ్రాన్సిన్ స్కాట్‌కీ వంతెనను భారీ కంటెయినర్ షిప్‌(Container Ship) ఢీకొంది. దీంతో క్షణాల్లోనే ఆ బ్రిడ్జి కూలిపోయింది. దీంతో అధికారులు.. భారత సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు ఆ వంతెనపై రాకపోకలను అకస్మాత్తుగా నిలిపివేశారు. అయితే ఈ ప్రమాదంలో ఈ వంతెనపై పనిచేస్తున్న ఆరుగురు కార్మికులు ఆ నదిలో పడిపోయారు. వాళ్లలో తాజాగా ఇద్దరి మృతదేహాలు దొరికాయి. మరో నలుగురి కోసం సహాయక సిబ్బంది గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

Also Read : బీజేపీకి ఆ విషయం అర్థం కావడం లేదు.. కేంద్రంపై పి.చిదంబరం ఫైర్‌

Advertisment
తాజా కథనాలు