Union Minister Kishan Reddy: రైతులను నిండా ముంచిన కేసీఆర్.. కిషన్ రెడ్డి సంచలన కామెంట్స్.. బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు వెన్ను పోటు పొడుస్తోందన్నారు. రైతుకు మేలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం.. ఇప్పుడు రైతులను నిండా ముంచిందని అన్నారు. By Shiva.K 05 Sep 2023 in Latest News In Telugu హైదరాబాద్ New Update షేర్ చేయండి Union Minister Kishan Reddy: బీఆర్ఎస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) రైతులకు వెన్ను పోటు పొడుస్తోందన్నారు. రైతుకు మేలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కేసీఆర్(CM KCR) ప్రభుత్వం.. ఇప్పుడు రైతులను నిండా ముంచిందని అన్నారు. మంగళవారం నాడు రంగారెడ్డి జిల్లా బొంగళూరులో భారతీయ జనతా కిసాన్ మోర్చా(BJP Kisan Morcha) ఆధ్వర్యంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు ఎదుర్కొంటున్న సమస్యలపై కిసాన్ సమ్మేళనం కార్యక్రమంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో ప్రసంగించిన కిషన్ రెడ్డి.. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. నాలుగున్నరేళ్లుగా రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేశారని విమర్శించారు. కేసీఆర్ ఇచ్చిన రూ. లక్ష రుణ మాఫీ కేవలం వడ్డీలకే సరిపోతుందన్నారు. లక్షలాది మంది రైతులను రుణ మాఫీ పేరుతో మోసం చేశారని అన్నారు. రైతులకు ఉచిత ఎరువులు పంపిణీ చేస్తామని చెప్పి.. అలా కూడా రైతులను కేసీఆర్ మోగించారని విమర్శించారు కేంద్ర మంత్రి. ప్రకృతి వైపరీత్యాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులపై కేసీఆర్ ప్రభుత్వం ఉదాసీనత.. రైతులకు శాపంగా మారుతోందన్నారు కిషన్ రెడ్డి. రైతులను అదుకునే 'ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన' పథాకాన్ని అమలు చేయకుండా కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. ధరణి పేరుతో లక్షలాది ఎకరాల భూమిని బీఆర్ఎస్ నేతలు దోచుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. గురివింద గింజ సామెత మాదిరిగా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మహిళా రిజర్వేషన్ గురించి మాట్లాడే హక్కు కల్వకుంట్ల కుటుంబానికి లేదంటూ ఎమ్మెల్సీ కవితకు కౌంటర్ ఇచ్చారు కేంద్రమంత్రి. భారత రాష్ట్ర సమితి తరఫున వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాలో 33 శాతం రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. ఆ పార్టీలో మహిళలకు కనీసం 10 శాతం సీట్లు కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. బీజేపీలో దరఖాస్తుల స్వీకరణ పర్వం.. తెలంగాణ బీజేపీలో దరఖాస్తుల స్వీకరణ పర్వం కొనసాగుతోంది. తెలంగాణలోని 119 నియోజకవర్గాలకు బీజేపీ తరఫున పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థుల నుంచి ఆ పార్టీ దరఖాస్తులను ఆహ్వానించింది. తొలి రోజు 180కి పైగా దరఖాస్తులు రాగా.. రెండవ రోజు 175 మంది ఆశావహుల నుంచి దరఖాస్తులు వచ్చినట్లు పార్టీల నుంచి సమాచారం అందుతోంది. ఇప్పటి వరకు మొత్తం 357 దరఖాస్తులు వచ్చినట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నారు. కాగా, ఈ దరఖాస్తులకు ఈ నెల 10 వ తేదీ వరకు అవకాశం ఉంది. ఈలోగా ఎవరైనా ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల ప్రక్రియ పూర్తయిన తరువాత.. పార్టీలో అధినాయకత్వం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, పోటీలో నిలిచే అభ్యర్థులను ఖరారు చేయనుంది. ధరణి బీఆర్ఎస్ నాయకులకు భరణి ఇవాళ రంగారెడ్డి జిల్లా బొంగుళూరు లో జరిగిన బీజేపీ కిసాన్ మోర్చా రైతు సమ్మేళనం లో పాల్గొన్నాను. కేసిఆర్ ప్రభుత్వంలో రైతులు పడుతున్న గోసను తెలియచేసాను. రైతును రాజును చేస్తా అని గొప్పలు చెప్పి రైతులకు కనీసం పంట భీమా కూడా కల్పించకుండా కేసిఆర్ మోసం… pic.twitter.com/XD86Q5rKtB — G Kishan Reddy (@kishanreddybjp) September 5, 2023 Also Read: నా రాజీనామాతోనే మునుగోడు అభివృద్ధి చెందింది: రాజగోపాల్ రెడ్డి Prashant Kishor: తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్‌దే గెలుపు.. పీకే కీలక వ్యాఖ్యలు #hyderabad #cm-kcr #bjp-kishan-reddy #bjp-vs-kcr మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి