Telangana: కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్ట్స్ ఎందుకివ్వడం లేదు.. కిషన్ రెడ్డి సంచలన ఆరోపణలు..

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కేసీఆర్ అవినీతి కారణంగానే నేడు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయే స్థితికి చేరిందన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన రిపోర్ట్స్ కేంద్రానికి ఎందుకివ్వడం లేదని ఆయన ప్రశ్నించారు.

Kishan Reddy : ప్రజల ధనాన్ని దోచుకున్న వాళ్ళను.. అరెస్ట్ చేస్తే  కక్ష సాధింపు ఎలా అవుతుందో కేసీఆర్ చెప్పాలి.!
New Update

Union Minister Kishan Reddy: కాళేశ్వరం పరిస్థితి చూస్తే గుండె రగిలిపోతుందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ప్రాజెక్టు కోసం పెట్టిన డబ్బులన్నీ రాళ్ల పాలు చేశారని విమర్శించారు. శుక్రవారం నాడు కత్రియ హోటల్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 'కాంగ్రెస్ హయాంలో రూ. 30వేల కోట్లతో ప్రాణహిత పేరుతో ప్రాజెక్ట్ నిర్మాణం చేపడతామన్నారు. 2015లో రూ. 40వేల కోట్లతో ప్రాజెక్ట్‌ ప్రారంభం అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను చూసి కేసీఆర్ జబ్బలు చరుసుకున్నారు. కానీ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు గుది బండగా మారింది. ప్రాజెక్ట్ మొత్తం కూలగొట్టి రీ కన్‌స్ట్రక్షన్ చేయాలని ఇంజనీర్లు చెబుతున్నారు. పిల్లర్స్ కుంగుబాటుపై సమధానం చెప్పలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ప్రాజెక్టు విషయంలో ట్రాన్స్‌పరెన్సీ పాటించలేదు. ఇన్నివేల కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్టుతో ఎవరికి లాభం? ప్రధాని మోడీ ప్రాజెక్టుల పరిరక్షణ కోసం 2021 లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీను తీసుకొచ్చారు. కాళేశ్వరం పిల్లర్ కుంగుబాటుపై తాను కేంద్ర జలశక్తి సంఘానికి ఫిర్యాదు చేశాను. వారి బృందం వచ్చి పరిశీలించి, నిన్న(గురువారం) కేంద్రానికి ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్‌లో కాళేశ్వరం భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది.' అని రాష్ట్ర ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు కిషన్ రెడ్డి.

Also Read: ఫేక్ ప్రామిస్‌లకు కేరాఫ్ కాంగ్రెస్.. ఆర్టీవీ స్టోరీని ట్వీట్ చేసిన ఎమ్మెల్సీ కవిత..

ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం రిపోర్ట్స్ అడిగితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని ఆరోపించారు కిషన్ రెడ్డి. కొన్ని మాత్రమే ఇచ్చారని, చాలా రిపోర్ట్స్ ఇవ్వలేదన్నారు. 'కేంద్ర బృందం అడిగిన చాలా రిపోర్ట్స్‌ని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. డ్యామ్ మేజర్ రిపోర్ట్స్ ప్రభుత్వం దగ్గర లేవు. ఇది చాలా దురదృష్టకరం. ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ, నిర్వహణ సరిగా లేకనే డ్యామ్ పిల్లర్ కూలిందని కేంద్ర బృందం రిపోర్ట్ ఇచ్చింది. ప్రాజెక్ట్ పిల్లర్ ఫౌండేషన్ సైతం సరిగా లేదనే రిపోర్ట్ ఇచ్చారు. పిల్లర్ల కింద సింగిల్ స్టోన్ వాడకం వాళ్ల ప్రాజెక్ట్ దెబ్బతినే ప్రమాదం ఉందని కేంద్ర బృందం తెలిపింది. కాళేశ్వరం డిజైనింగ్ తప్పుగా ఉందని ఇంజనీర్లు మొత్తుకున్నా.. నాడు కేసీఆర్ పట్టించుకోలేదు. స్వయంగా కేసీఆరే ఇంజనీర్ అవతారం ఎత్తి ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టడం వల్లే ఈరోజు ఈ దుస్థితికి కారణమైంది. వాటర్ స్టోరేజ్‌లో మెడిగడ్డే చాలా కీలకం. అదే దెబ్బతింటే ఇంకా ప్రాజెక్ట్ నిర్మాణం వెస్ట్. దీనంతటికీ సీఎం కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలి. ప్రాజెక్ట్ దెబ్బ తింటే కింద ఉన్న గ్రామాల పరిస్థితి ఎంటి? ప్రాజెక్ట్ వైఫల్యం తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు తీరని నష్టాన్ని మిగులుస్తుంది. ఇదే విషయాన్ని కమిటీ కూడా పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం కమిటీ అడిగిన వివరాలను అడిగినా ఎందుకు దాస్తుంది? నిర్దిష్ట సమయంలో ఆ రిపోర్ట్స్ ఇవ్వాలి. రిపోర్ట్స్ ఇవ్వకుంటే బీజేపీ అధికారంలోకి రాగానే పూర్తీ స్థాయి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. సీఎం కేసీఆర్‌తో సహా దీనికి బాధ్యులైన వారెవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు.' అని తీవ్ర స్వరంతో హెచ్చరించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.

Also Read: సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిన కాసాని జ్ఞానేశ్వర్

#telangana-news #cm-kcr #union-minister-kishan-reddy #kaleshwaram-project
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe