Telangana: సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిన కాసాని జ్ఞానేశ్వర్

తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన కాసాని జ్ఞానేశ్వర్.. బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ పార్టీ కండువా కప్పి కాసానిని పార్టీలోకి ఆహ్వానించారు. కాసానితో పాటు భారీ స్థాయిలో ఆయన అనుచరులు కూడా బీఆర్ఎస్ లో చేరారు.

New Update
Telangana: సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిన కాసాని జ్ఞానేశ్వర్

Telangana Elections: టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన కాసాని జ్ఞానేశ్వర్.. బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గులాబీ దళపతి, సీఎం కేసీఆర్.. జ్ఞానేశ్వర్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన సీఎం కేసీఆర్.. ముదిరాజులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు ముగిసిన తరువాత ముదిరాజ్‌ల ప్రతినిధులతో సమావేశం అవుతానని చెప్పారు. 119 సీట్లల్లో 112 మాత్రమే లెక్కలోకి వస్తాయని అన్నారు. తమాషాకి అభ్యర్థులను పెట్టొద్దని, నిలబడితే గెలిచి తీరాల్సిందేనని అన్నారు కేసీఆర్. వృత్తి పరంగా ముదిరాజ్‌లకు న్యాయం చేశామన్నారు సీఎం కేసీఆర్. గ్రామాల్లో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని తెలిపారు.

ఇదే సమయంలో ఈటల రాజేందర్‌పై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు సీఎం కేసీఆర్. ఈటల రాజేందర్ కన్నా పెద్ద మనిషి అయిన కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్‌లోకి చేరారని అన్నారు. రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవులను ముదిరాజ్‌లకు కేటాయిస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు సీఎం కేసీఆర్. ముదిరాజ్‌ల నుండి ఎక్కువ సంఖ్యలో నాయకులు తయారు అవ్వాల్సిన అవసరం ఉందన్నారు సీఎం. నామినేటెడ్ పదవుల్లో ముదిరాజ్‌లకు పెద్ద పీట వేస్తామన్నారు. ఈటల రాజేందర్ ముదిరాజ్ కులంలో ఎవరినీ ఎదగనివ్వలేదని ఆరోపించిన సీఎం కేసీఆర్.. బండ ప్రకాష్‌ను తీసుకువచ్చి పదవులు ఇచ్చామని గుర్తు చేశారు.publive-image

Also Read: ప్లీజ్ నన్ను మైలార్డ్ అని పిలవకండి…

కాసానితో పాటు వీరు కూడా..

పార్టీ లో చేరిన వారిలో.. కాసానితో పాటు టిడిపి మాజీ జాతీయ కార్యదర్శి కాసాని వీరేశ్, బోయినపల్లి మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ముప్పిడి గోపాల్, టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గా పనిచేసిన ప్రకాష్ ముదిరాజ్, టిడిపి రాష్ట్ర జనరల్ సెక్రటరీ బండారి వెంకటేష్ ముదిరాజ్, పటాన్ చెరువు కాంగ్రెస్ లీడర్ సపానాదేవ్ ముదిరాజ్, టిడిపి స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీలు మేకల భిక్షపతి ముదిరాజ్, పుట్టిరాజ్ ముదిరాజ్, టిడిపి కరీంనగర్ నియోజవర్గ ఇంఛార్జ్ కనకయ్య ముదిరాజ్, టిడిపి ముషీరాబాద్ నియోజకవర్గ ఇంఛార్జ్ తలారి శ్రీకాంత్ ముదిరాజ్, టిడిపి బాన్సువాడ ఇంఛార్జి కరాటే రమేశ్ ముదిరాజ్, టిడిపి స్టేట్ కల్చరల్ వింగ్ అధ్యక్షుడు చంద్రహాస్, ముదిరాజ్ మహాసభ స్టేట్ జనరల్ సెక్రటరీ డాక్టర్ జగదీశ్వర్ ప్రసాద్ ముదిరాజ్, బిజెపి స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మంద శ్రీనివాస్ ముదిరాజ్, ముదిరాజ్ మహాసభ నిజాంపేట్ నాయకుడు ఆంజనేయులు ముదిరాజ్, మేడ్చల్ బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు దొంతి నర్సింహులు ముదిరాజ్, టిడిపి స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జి.జగదీష్ యాదవ్, టిడిపి స్టేట్ సెక్రటరీ మన్నె రాజు, టిడిపి నిజాంపేట్ మున్సిపల్ కార్పోరేషన్ జనరల్ సెక్రటరీ దూసకంటి వెంకటేష్, బాచుపల్లి మాజీ ఎంపిటిసి నందిగామ సత్యనారాయణ, టిడిపి నిజాంపేట్ మున్సిపల్ కార్పోరేషన్ మైనార్టీ అధ్యక్షుడు లష్కర్ అశోక్ కుమార్, టిడిపి గుడి మల్కాపూర్ అధ్యక్షుడు అక్కెర శివరాజు ముదిరాజ్ తదితరులు బీఆర్ఎస్ పార్టీ లో చేరారు.

publive-image

Also Read: కాళేశ్వరం పై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సంచలన నివేదిక

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు