Paris Olympics: పారిస్ ఒలంపిక్స్ కోసం భారీగా ఖర్చు పెట్టిన భారత్..

పారిస్‌ ఒలిపింక్స్‌లో భారత్‌ నుంచి 117 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. 2021లో టోక్యోలో జరిగిన ఒలింపిక్స్‌లో భారత్ 7 పతకాలు సాధించగా ఈసారి కూడా ఎక్కవగా సాధించాలని భావిస్తోంది. భారత ప్రభుత్వం కూడా ఒలింపిక్స్ సన్నాహకాల కోసం దాదాపు రూ.470 కోట్లు ఖర్చు చేసింది.

Paris Olympics: పారిస్ ఒలంపిక్స్ కోసం భారీగా ఖర్చు పెట్టిన భారత్..
New Update

ఈరోజు ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో ఒలిపింక్స్ పోటీలు అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. ఇందులో భారతదేశం నుంచి మొత్తం 117 మంది క్రీడాకారులు పాల్గొనున్నారు. 2021లో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి మొత్తం 7 పతకాలు సాధించింది. దీంతో మరోసారి భారత జట్టు పతకాలు పెంచుకోవాలని భావిస్తోంది. దీని కోసం భారత ప్రభుత్వం కూడా భారీగానే ఖర్చు పెట్టింది. ఒలింపిక్స్ సన్నాహకాల కోసం దాదాపు రూ.470 కోట్లు ఖర్చు పెట్టింది. ఇందులో వెయిట్ లిఫ్టింగ్ కోసం రూ.26.98 కోట్లు, టేబుల్ టెన్నిస్‌పై రూ.12.92 కోట్లు, జూడోపై రూ.6.30 కోట్లు, స్విమ్మింగ్‌ పై రూ.3.90 కోట్లు ఖర్చు పెట్టింది.

Also read: నీట్-యూజీ రివైజ్డ్ ఫలితాలు విడుదల.. ఇదిగో డైరెక్ట్‌ లింక్

పారిస్ ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్ కేటగిరీలో భారత్ అత్యధికంగా 29 మంది ఆటగాళ్లను పంపించింది. వీరి కోసం ప్రభుత్వం రూ. 96.08 కోట్లు ఖర్చు చేసింది. దీని తర్వాత బ్యాడ్మింటన్ కోసం 72.02 కోట్లు కేటాయించింది. ఒలింపిక్స్ చరిత్రలో ఈ గేమ్‌ లో మొత్తం 3 పతకాలు సాధించింది భారత్. బాక్సింగ్‌లో రూ.60.93 కోట్లు, షూటింగ్‌లో రూ.60.42 కోట్లు ఖర్చు చేసింది. బాక్సింగ్‌ లో ఇప్పటివరకు భారత్ మొత్తం 3 పతకాలు సాధించింది. అలాగే హాకీకి రూ.41.29 కోట్లు, ఆర్చరీకి రూ.39.18 కోట్లు, రెజ్లింగ్‌కు రూ.37.80 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది. ఒలింపిక్ చరిత్రలో భారత్ హాకీలో మొత్తం 12 పతకాలు సాధించగా.. అందులో 8 బంగారు పతకాలు ఉన్నాయి.

Also read: ఐఫోన్‌ కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన ధరలు

#2024-paris-olympics #telugu-news #paris-olympics-2024
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe