NEET-PG : రెండు రోజుల్లో నీట్-పీజీ పరీక్ష షెడ్యూల్!

ఒకటి రెండ్రోజుల్లో నీట్-పీజీ పరీక్షల కొత్త షెడ్యూల్‌‌ను ప్రకటిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. నీట్-పీజీ పరీక్ష ప్రశ్నపత్నం డార్క్ నెట్లో లీకైందని, టెలిగ్రామ్ యాప్‌లో షేర్ చేశారని చెప్పారు. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేస్తోందన్నారు.

NEET-PG : రెండు రోజుల్లో నీట్-పీజీ పరీక్ష షెడ్యూల్!
New Update

NEET-PG Exam Schedule : నీట్-పీజీ పరీక్షల (NEET-PG Exam) కొత్త షెడ్యూల్‌ పై కీలక ప్రకటన చేశారు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan). ఒకటి రెండ్రోజుల్లో నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్స్ (ఎన్‌బీఈ) కొత్త తేదీలను ప్రకటిస్తుందని తెలిపారు. నీట్-పీజీ పరీక్ష ప్రశ్నపత్నం డార్క్ నెట్లో లీకైందని, టెలిగ్రామ్ యాప్‌ (Telegram App) లో షేర్ చేశారని చెప్పారు. ఈ వ్యవహారంపై సీబీఐ (CBI) దర్యాప్తు చేస్తోందని.. త్వరలోనే నిందితులను పట్టుకొని కఠిన శిక్ష అమలు చేస్తామని అన్నారు. కీలకమైన పోటీ పరీక్షల్లో పేపర్ లీకవుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో గతవారం జరగాల్సిన నీట్-పీజీ పరీక్షను ముందు జాగ్రత్తగా రద్దు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు జూన్ 18న జరిగిన యూజీసీ-నెట్ పరీక్ష కూడా రద్దయ్యింది.

Also Read : ‘కల్కి’ యూనివర్స్ పై కమల్ అదిరిపోయే అప్డేట్.. అంతా పార్ట్-2 లోనే అంటూ!

#neet-pg #cbi #dharmendra-pradhan #telegram
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి