Kamal Haasan : 'కల్కి' యూనివర్స్ పై కమల్ అదిరిపోయే అప్డేట్.. అంతా పార్ట్-2 లోనే అంటూ!

'కల్కి2898AD' సినిమాలో సుప్రీమ్ యాస్మిన్ పాత్ర పోషించిన కమల్ హాసన్ తాజాగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కల్కి పార్ట్-2 పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. కల్కి రెండో భాగంలోనే నా పాత్ర అధికంగా ఉంటుందని అన్నారు.

New Update
Kamal Haasan : 'కల్కి' యూనివర్స్ పై కమల్ అదిరిపోయే అప్డేట్.. అంతా పార్ట్-2  లోనే అంటూ!

Kamal Haasan About Kalki Part-2 : ప్రభాస్ (Prabhas), దీపికా పదుకొనె (Deepika Padukone), అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), కమల్ హాసన్ (Kamal Haasan) ప్రధాన పాత్రల్లో నటించిన 'కల్కి2898AD' మూవీ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టిస్తోంది. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాపై ఆడియన్స్ తో పాటూ సెలెబ్రిటీస్ సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక సినిమాలో సుప్రీమ్ యాస్మిన్ పాత్ర పోషించిన కోలీవుడ్ స్టార్ కమల్ హాసన్ తాజాగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కల్కి పార్ట్-2 పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.

నా పాత్రంతా పార్ట్-2 లోనే...

కల్కి సినిమాను తాజాగా చెన్నై లో చూసిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.." కల్కి రెండో భాగంలోనే నా పాత్ర అధికంగా ఉంటుంది. ఒక అభిమానిగా మొదటి భాగం చిత్రీకరణలో పాల్గొన్నా. ఇండియన్‌ సినిమా ఇప్పుడు గ్లోబల్‌ స్థాయిలో సందడి చేస్తోంది. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌కు సహనం ఎక్కువ. పురాణాలను సైన్స్‌కు ముడిపెట్టి కల్కిని అందంగా రూపొందించారు. నన్ను యువనటుల జాబితాలో చేర్చాలా.. అలనాటి నటీనటుల లిస్ట్‌లో చేర్చాలా అని చాలా ఆలోచించారు. చాలా ఓపికగా కథను రాసుకున్నారు. అంతే ఓపికగా తెరకెక్కించారు" అంటూ చెప్పుకొచ్చారు.

Also Read : పుష్ప నటుడు ఫహద్ ఫాసిల్ పై కేసు.. కారణం ఆ సినిమానే..!

ఆయన మాటల్ని బట్టి కల్కి పార్ట్-2 లో కమల్ విలనిజం ఓ రేంజ్ లో ఉండబోతుందని అర్థమవుతుంది. కాగా బాక్సాఫీస్ దగ్గర రూ.190 కోట్లతో రికార్డ్ ఓపెనింగ్స్ అందుకున్న ఈ సినిమా ప్రస్తుతం థియేటర్స్ లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యే లోపు రూ.500 కోట్ల క్లబ్ లో కచ్చితంగా చేరుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు