Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుంది. వరుస జాతీయ నేతల పర్యటనలతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సహం పెంచుతున్నారు. తాజాగా తెలంగాణ పర్యటనలో ఉన్న కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలమైందని అన్నారు. దేశంలో అన్ని నగరాల్లో పోల్చితే హైదరాబాద్ నగరంలోనే గ్యాస్ ధరలు అత్యధికంగా ఉన్నాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అప్పులు రూ.3.66 లక్షల కోట్లకు పెరిగాయని విమర్శించారు.
ALSO READ: బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు ఛాతి నొప్పి
సీఎం కేసీఆర్ (CM KCR) పాలనలో తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం బాగా పెరిగిందని అన్నారు. ఇది జాతీయ సగటు కన్నా ఎక్కువని.. నిత్యావసరాల ధరలు కూడా భారీగా పెరిగాయని తెలిపారు. దేశంలో ఎక్కడలేని విధంగా తెలంగాణలోనే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఎక్కువ ఉన్నాయని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం వ్యాట్ ఎక్కువగా వసూలు చేస్తోందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిరుద్యోగ రేటు గణనీయంగా పెరిగిందని ఆరోపించారు. నిరుద్యోగ రేటు 7.8 (పురుషులు), 9.5 (మహిళలు)గా ఉందని వెల్లడించారు.
ALSO READ: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు హైకోర్టులో ఊరట
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ ఏర్పాటుపై పలు కామెంట్స్ చేశారు చిదంబరం. భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రాతిపదికనే ఏపీ ఏర్పడిందని అన్నారు. సీఎం కేసీఆర్ చరిత్ర సరిగ్గా చదవలేదని సెటైర్లు వేశారు. ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఆరు గ్యారెంటలను ఖచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.