IND vs AUS: ఏడు నెలల్లో మూడుసార్లు.. కంగారూల దెబ్బకు టీమిండియా అభిమానులకు కన్నీళ్లు!

గత 7 నెలల్లో ముగిసిన మూడు ఐసీసీ మేజర్‌ ఈవెంట్లలో భారత్‌ ప్రతీసారి ఆస్ట్రేలియా చేతిలో ఫైనల్‌లో ఓడిపోయింది. WTC ఫైనల్‌, వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌తో పాటు తాజాగా జరిగిన అండర్‌-19 వరల్డ్‌కప్‌ ఫైనల్‌లోనూ భారత్‌ ఆస్ట్రేలియాపై ఓడిపోయింది.

IND vs AUS: ఏడు నెలల్లో మూడుసార్లు.. కంగారూల దెబ్బకు టీమిండియా అభిమానులకు కన్నీళ్లు!
New Update

INDIA vs AUSTRALIA U-19 WC Final: గతేడాది(2023) జూన్‌లో జరిగిన ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్‌లో భారత్‌ ఓడిపోయింది. ఆస్ట్రేలియాపై ఓవల్‌ వేదికగా జరిగిన ఫైనల్‌లో కంగుతిన్నది టీమిండియా. ఏకంగా 209 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత వన్డే ప్రపంచకప్‌లోనూ ఇండియా ఫైనల్‌కు వచ్చింది. అక్కడ కూడా ఫైనల్‌లో ఆస్ట్రేలియానే. అయితే వన్డే ప్రపంచకఫ్‌లోనూ అదే రిజల్ట్. అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన ఫైనల్‌లో ఇండియాపై ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆరోసారి వరల్డ్‌కప్‌ను ఆరేసింది. మూడోసారి వరల్డ్‌కప్‌ సాధించాలన్న టీమిండియా కల చెదిరిపోయింది. అభిమానుల గుండె పగిలింది. ఇక్కడితో ఈ స్టోరీ ఆగలేదు. తాజాగా అండర్‌-19 వరల్డ్‌కప్‌ ఫైనల్‌లోనూ సేమ్‌ సీన్‌ రిపీట్.


ఫైనల్‌లో ఎందుకిలా?
నిజానికి అండర్‌-19 వరల్డ్‌కప్‌లో మన కుర్రాళ్లు ఇరగదీశారు. ఓటమే లేకుండా ఫైనల్‌ వరకు దూసుకొచ్చారు. వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా సీనియర్‌ జట్టు ఎలా ఆడింతో అంతే ఆడారు. అటు ఆస్ట్రేలియా కూడా వన్డే ప్రపంచకప్‌లో ఎలాగైతే ఫైనల్‌కు వచ్చిందో అండర్‌-19లోనూ అదే విధంగా ఫైనల్‌లో అడుగుపెట్టింది. మళ్లీ అక్కడి సీనే ఇక్కడ రిపీట్ అయ్యింది. అండర్‌-19 వరల్డ్‌కప్‌ ఫైనల్‌లో భారత్‌ ఓటమి అభిమానులను మరోసారి తీవ్రంగా బాధించింది. ఐసీసీ మేజర్‌ ఈవెంట్లో ఏడు నెలల్లో టీమిండియా ఫైనల్‌లో ఇలా ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడం ఇది వరుసగా మూడోసారి.


ఐసీసీ టోర్నమెంట్లలో రారాజు:
బెనోనిలోని విల్లోమూర్ పార్క్‌లో జరిగిన టోర్నమెంట్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా 79 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింద. 253 పరుగుల స్కోరును కాపాడుకుంటూ 43.5 ఓవర్లలో భారత్‌ను 174 పరుగులకు ఆలౌట్ చేసి టోర్నమెంట్‌లో అజేయంగా నిలిచింది. మహ్మద్ కైఫ్, విరాట్ కోహ్లి, ఉన్ముక్త్ చంద్, పృథ్వీ షా, యష్ ధుల్‌ల జాబితాలోఉదయ్ సహారన్ చేరలేకపోయాడు. నిజానికి ఈ టోర్నిలో భారత్‌కు అద్భుతమైన రికార్డు ఉంది. ఆరుసార్లు అండర్‌-19 వరల్డ్‌కప్‌ గెలుచుకుంది. అటు ఆస్ట్రేలియా నిన్నటి విజయంతో నాలుగుసార్లు ఈ ట్రోఫిని ముద్దాడింది. 2010 తర్వాత ఇది మొదటి అండర్‌-19 టైటిల్‌. మొత్తంగా 14వ ఐసీసీ టైటిల్ కూడా.

Also Read: ఈ హగ్‌ డే రోజున మీ ప్రియమైన వారిని కవితల కౌగిలిలో బంధించేయండి!

WATCH:

#india-vs-australia #wtc #icc-world-cup-2023 #icc-under-19-world-cup-2024
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe