భారత్ లో రెండుచోట్ల భూకంపం.. భయం గుప్పిట్లో ప్రజలు
ఇండియాలో గురువారం రెండు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. ఉత్తరఖండ్‌లోని ఉత్తరకాశీలో తెల్లవారుజామున 2.02 గంటలకు భూమి కంపించగా, ఉదయం 9:34 గంటలకు జమ్మూ కశ్మీర్‌లోనూ ప్రకంపనలు వచ్చినట్లు ఎన్ సీఎస్ అధికారులు తెలిపారు. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు.