/rtv/media/media_files/2025/03/26/rMIVOoQEdkoE6HMudqAB.jpg)
Meerut murder case 123 Photograph: (Meerut murder case 123)
మర్చెంట్ నావే ఆఫీసర్ సౌరభ్ రాజ్‌పుత్ హత్య కేసులో పోలీసులు కీలక సమాచారం రాబట్టారు. ఉత్తరప్రదేశ్ మీరట్‌లో అతని భార్య ముస్కాన్, ఆమె ప్రియుడు సాహిల్ పక్కా ప్లాన్ ప్రకారం సౌరభ్‌ను మర్డర్ చేశారు. డెడ్‌బాడీని ఎవ్వరూ గుర్తిపట్టకుండా ఉండేందుకు మెండెం నుంచి తల వేరు చేశారు. అలాగే వేలిముద్రల సహాయంతో మృతదేహం ఎవరిదని కనుకొగకుండా ఉండేందుకు చేతులు మణికట్టు దగ్గర వేరు చేశారు. పోస్టుమార్టం రిపోర్ట్, పోలీసుల విచారణలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. జుడిషియల్ కస్టడీలో ఉన్న ముస్కాన్, సాహిల్ ఒప్పుకున్నారు.
Also read: Kunal Kamra: మరో వివాదంలో కునాల్ కామ్రా.. ఈసారి నిర్మలా సీతారామన్ టార్గెట్
If Evil Had a Face!
— Advocate Simran Sahni (@simrannsahni) March 19, 2025
Meerut’s #MuskanRastogi and her boyfriend #Sahil brutally murdered her husband #Saurabh, dismembered him and hid the body in cement. Days later, they married and honeymooned in Shimla.
Where are we heading?pic.twitter.com/bLnfm4dqWD
Also read: Man Rapes Goat: నీ కామం తగలెయ్య.. మేకను కూడా వదల్లేదు కదరా..!
మృతదేహాన్ని గుర్తించడం కష్టతరం చేయడానికి ముక్కలు ముక్కలు చేసినట్లు అంగీకరించారని పోలీసు వర్గాలు బుధవారం తెలిపాయి. విచారణలో వేలిముద్రల ద్వారా పోలీసులు సౌరభ్‌ను గుర్తించకుండా ఉండటానికి అతని మణికట్టును కోసినట్లు ఇద్దరూ అంగీకరించారు. తల లేని డెడ్‌బాడీ గుర్తించకుండా ఉంటుందని అతని గొంతు కోసి, తల నరికి చంపినట్లు వారు వెల్లడించారని వర్గాలు తెలిపాయి. ఫోరెన్సిక్ టీం బెడ్‌షీట్‌లు, దిండులపై, అలాగే బాత్రూమ్ టైల్స్ మరియు ట్యాప్‌పై రక్తపు మరకలను కనుగొంది. అంతేకాదు ఇన్వెస్టిగేషన్ అధికారులు క్రైమ్ సీన్ నుంచి ఓ ఒక సూట్‌కేస్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. మొదట మృతదేహాన్ని పారవేసేందుకు ముస్కాన్, సాహిల్ సూట్‌కేసు తెచ్చారు. డెడ్‌బాడీ సూట్‌కేస్ లోపల పట్టకపోవడంతో ఖాళీ డ్రమ్‌లో వేసి దాని నిండా సిమెంట్ వేసి కప్పెట్టారు. సూట్‌కేస్‌లో రక్తపు మరకలు అలాగే ఉన్నాయి. ఈ కేసుతో నేరుగా సంబంధం ఉన్న దాదాపు 10, 12 మంది వ్యక్తుల స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డ్ చేశారు. అన్ని ఆధారాలను సేకరించి, పోలీసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు, రాజ్‌పుత్ భార్య ముస్కాన్ రస్తోగి మరియు ఆమె ప్రేమికుడు సాహిల్ శుక్లా, రాజ్‌పుత్ ఛాతీపై అనేకసార్లు కత్తితో పొడిచి, అతని శరీరాన్ని ముక్కలు చేసి సిమెంట్ నిండిన డ్రమ్ములలో దాచిపెట్టిన విషయం తెలిసిందే.