AC explosion: ఇంట్లో AC పేలి ఫ్యామిలీలో నలుగురు మృతి.. మరొకరికి తీవ్రగాయాలు

ఏసీ పేలి ఓ కుటుంబంలో నలుగురు చనిపోయిన విషాదం హర్యాణలో చోటుచేసుకుంది. ఝజ్జర్ జిల్లా బహదూర్‌గఢ్‌లోని అద్దె ఇంట్లో ఏసీ కప్రెసర్ పేలి భారీ పేలుడు సభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లలు, ఓ మహిళ, మరో వ్యక్తి చనిపోగా.. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి.

New Update
AC explosion

AC explosion Photograph: (AC explosion)

ఎండకాలం అని ఏసీ వాడుతున్నారా.. అయితే ఈ వార్త మీ కోసమే. ఏసీ కంప్రెసర్ పేలితే చాలా పెద్ద అగ్ని ప్రమాదం సంభవిస్తుంది. ఇంట్లో ఏసీ కంప్రెసర్ పేలి నలుగురు చనిపోయిన విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లలు, మహిళతో సహా నలుగురు మరణించారు. ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు, ఫైర్‌ సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. హర్యానాలోని ఝజ్జర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బహదూర్‌గఢ్‌లోని అద్దె ఇంట్లో ఒక కుటుంబం నివసిస్తున్నది. శనివారం సాయంత్రం ఆ ఇంట్లో ఉన్న ఏసీ కంప్రెసర్‌ పేలింది. ఈ సంఘటనలో మహిళ, పదేళ్ల వయస్సున్న ఇద్దరు పిల్లలు, ఒక వ్యక్తి మరణించారు. మరో వ్యక్తికి కాలిన గాయాలయ్యాయి. ఈ పేలుడు శబ్దానికి స్థానికులు భయాందోళన చెందారు. వెంటనే పోలీసులు, ఫైర్‌ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

Also read: నేను కేసీఆర్ అంత మంచోడిని కాదు : KTR

 పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ ఇంట్లో చెలరేగిన మంటలను ఆర్పివేశారు. మరణించిన నలుగురి మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తిని కూడా హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏసీ కంప్రెసర్‌ పేలడానికి టెక్నికల్ ఇష్యూస్ ఎమైనా ఉన్నాయన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏసీ మెయింటెనెన్స్ సరిగా లేనప్పుడు ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటాయ ఎయిర్ కండిషనర్ టెక్నిషియన్స్ చెబుతున్నారు. ఎండకాలం కాబట్టి ఏసీ ఎక్కువగా వాడుతుంటారు. వారు రెగ్యులర్ సర్వీసులు చేయిచుకోవాలి. అలాగే ఏసీ కండిషన్ కూడా చెక్ చేయించాలి. ఈ విషయాన్ని ఏసీ కొనాలనుకునే మీ ఫ్రెండ్స్‌కు లేదా ఇంట్లో ఏసీ ఉన్నవారికి షేర్ చేయండి. 

Also read: Meerut Murder case: జైలు భోజనం వద్దు.. డ్రగ్స్ కావాలని సాహిల్ డిమాండ్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు