Un Known Facts About Bharateeyudu Movie : సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదని, వాటి ద్వారా ప్రజలకు సందేశాన్ని కూడా ఇవ్వొచ్చని నిరూపించిన వారిలో కోలీవుడ్ (Kollywood) సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ (Director Shankar) ముందు వరుసలో ఉంటారు. తన సినిమాలతో సమాజాన్ని మేలుకొల్పుతూ అగ్ర దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఈసారి 'భారతీయుడు 2' (Bharateeyudu 2) తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. అప్పట్లో వచ్చిన 'ఇండియన్' మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా జులై 12 న విడుదల కానుంది. ఈ సందర్భంగా భారతీయుడు కథ ఎలా పుట్టింది. ఈ సినిమా కోసం శంకర్ మొదట ఏ హీరోని అనుకున్నారు? తదితర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం...
ఫస్ట్ మూవీ 'జెంటిల్ మేన్' తో దర్శకుడిగా సత్తా చాటిన శంకర్.. ఆయన టాలెంట్ ను మెచ్చి అతనితో ఓ సినిమా చేసేందుకు ఆసక్తి చూపారట. ఓ వైపు ‘ప్రేమికుడు’ సినిమాని తెరకెక్కిస్తూనే.. రజనీకాంత్ కోసం ‘పెరియ మనుషన్’ అనే స్క్రిప్టు రెడీ చేశారు శంకర్. కానీ, ఆ సమయంలో రజనీకాంత్ వేరే ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉండడంతో శంకర్ సినిమా పట్టాలెక్కించేందుకు ఆలస్యమవుతూ వచ్చింది.
Also Read : డాక్టర్ కావాల్సిన కోట యాక్టర్ ఎలా అయ్యాడో తెలుసా?
ఆ కథలో కొన్ని మార్పులు చేసి, ఇండియన్ (భారతీయుడు)గా మార్చారని సమాచారం. సేనాపతిగా రాజశేఖర్, ఆయన కుమారుడి పాత్రలో వెంకటేశ్ లేదా నాగార్జునను తీసుకోవాలనుకున్నారు. ఆ కాంబో వర్కౌట్ కాలేదు. తర్వాత తమిళ నటులు కార్తిక్, సత్యరాజ్‌లను ఎంపిక చేద్దామనుకున్నా అదీ సాధ్యపడలేదు. చివరకు కమల్ హాసన్ ను సంప్రదించగా స్క్రిప్టు బాగా నచ్చడంతో ఆయనే ద్విపాత్రాభినయం చేసేందుకు ఆసక్తి చూపారు.