Modi-Putin: మోదీ-పుతిన్ ఆలింగనం.. జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు

భారత ప్రధాని మోదీ ప్రస్తుతం రష్యా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇరుదేశాధినేతలు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న ఫొటోలు వైరలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఎక్స్‌ వేదికగా తీవ్రంగా స్పందించారు. పుతిన్‌తో మోదీ సమావేశం తమను నిరాశపరిచిందని అన్నారు.

Modi-Putin: మోదీ-పుతిన్ ఆలింగనం.. జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు
New Update

PM Modi Russia Visit: భారత ప్రధాని మోదీ ప్రస్తుతం రష్యా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. రెండు రోజుల నిమిత్తం సోమవారం మాస్కో చేరుకున్న ప్రధానికి.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ (Vladimir Putin) ప్రత్యేక ఆతిథ్యమిచ్చారు. ఇరుదేశాధినేతలు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Volodymyr Zelenskyy) ఎక్స్‌ వేదికగా తీవ్రంగా స్పందించారు. పుతిన్‌తో మోదీ సమావేశం తమను నిరాశపరిచిందని అన్నారు.

Also Read: ప్రధాని మోదీకి రష్యా అత్యున్నత పౌర పురస్కారం..

' ఉక్రెయిన్‌లో సోమవారం రష్యా క్షిపణి దాడులు చేసింది. ఈ ఘటనలో 37 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. 13 మంది పిల్లలతో సహా మొత్తం 170 మంది గాయాలపాలయ్యారు. ఆ తర్వాత మరో చిన్నారుల ఆసుపత్రిపై రష్యా క్షిపణితో దాడి చేసింది. ఎంతోమంది శిథిలాల కింద ప్రాణాలు కోల్పోయారు. ఇది జరిగిన రోజు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి చెందిన నేత (మోదీని ఉద్దేశిస్తూ).. ప్రపంచంలోనే అత్యంత కిరాతక నేరస్థుడిని (పుతిన్‌) మాస్కోలో ఆలింగనం చేసుకున్నారు. ఇది తీవ్ర నిరాశ కలిగించింది. ఇది శాంతి చేసే ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ లాంటిదేనంటూ' జెలెన్ స్కీ పేర్కొన్నారు. రష్యా చేసిన దాడికి సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ అసంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రధాని మోదీ రష్యాలో పర్యటిస్తున్న సమయంలోనే ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణులతో విరుచుకుపడింది. ఐదు నగరాలను లక్ష్యంగా చేసుకొని భీకర దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో ఎన్నో ప్రభుత్వ భవనాలు, ఆసుపత్రులు, అపార్ట్‌మెంట్‌లు నెలమట్టమయ్యాయని జెలెన్‌స్కీ అన్నారు. అయితే రష్యా అధ్యక్షుడితో సమావేశం సందర్భంగా ప్రధాని మోదీ.. ఉక్రెయిన్‌తో యుద్ధం అంశాన్ని ప్రస్తావించారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. యుద్ధభూమిలో దేనికి పరిష్కారాలు లభించవని.. చర్చలు, దౌత్యమే ముందుకెళ్లే మార్గాలని మోదీ.. పుతిన్‌కు సూచించినట్లు తెలుస్తోంది.

Also Read: గాల్లో ఉండగానే ఊడిన విమానం టైరు.. చివరికి

#russia #zelensky #vladimir-putin #pm-modi
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe