బ్రిటన్‌లో జులై 4న సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. తాము ముందుస్తు ఎన్నికలకు వెళ్లనున్నామని ఇటీవలి యూకే ప్రధాని రిషి సునాక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా బ్రిటన్ పార్లమెంటు రద్దయింది. ఎన్నికల షెడ్యూల్‌కు అనుగూణంగా గురువారం పార్లమెంట్‌ను రద్దు చేశారు. ప్రస్తుతం ఆ దేశంలో మొత్తం 650 మంది సభ్యులు ఉన్నారు. పార్లమెంటు రద్దయిన వేళ.. ఈరోజు నుంచి ఐదు వారాల పాటు ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.
Also Read: జపాన్ సముద్రంపై బాలిస్టిక్ క్షిపణులు పరీక్షించిన ఉత్తర కొరియా
గత 14 ఏళ్లుగా బ్రిటన్‌లో కన్జర్వేటివ్ పార్టీ అధికారంలో ఉంది. రెండేళ్ల క్రితం ప్రధానిగా ఎన్నికైన లిజ్ ట్రస్.. రాజీనామా చేయడంతో.. భారత సంతతికి చెందిన రిషి సునాక్ బాధ్యతలు చేపట్టారు. అయినప్పటికీ ఆయన తీసుకునే నిర్ణయాలపై సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారు. అయితే మరో నెల రోజుల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఈ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఓడిపోతుందని ఎక్కువగా ఒపీనియన్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. ఈసారి విపక్ష పార్టీ అయిన లేబర్ పార్టీ మెరుగైన ఫలితాలు సాధిస్తుందనే అంచనాలు వెలువడుతున్నాయి.
Also Read: మోదీని ఓడించండి.. పాక్ మాజీ మంత్రి బహిరంగ పిలుపు