UGC: దేశవ్యాప్తంగా 157 యూనివర్సిటీల్లో లోపాలు.. యూజీసీ సంచలన ప్రకటన

దేశంలో లోపాలు ఉన్న యూనివర్సిటీల జాబితాను తాజాగా యూనియన్ గ్రాంట్ కమిషన్ (UGC) విడుదల చేసింది. మొత్తం 157 యూనివర్సిటిల్లో లోపాలు ఉన్నట్లుగా గుర్తించింది. ఇందులో 108 ప్రభుత్వ యూనిర్సిటీలు, 47 ప్రైవేట్ యూనివర్సిటీలు, 2 డీమ్డ్‌ యూనివర్సిటీలు ఉన్నాయి.

UGC: దేశవ్యాప్తంగా 157 యూనివర్సిటీల్లో లోపాలు.. యూజీసీ సంచలన ప్రకటన
New Update

దేశంలో లోపాలు ఉన్న యూనివర్సిటీల జాబితాను తాజాగా యూనియన్ గ్రాంట్ కమిషన్ (UGC) విడుదల చేసింది. మొత్తం 157 యూనివర్సిటిల్లో లోపాలు ఉన్నట్లుగా గుర్తించింది. ఇందులో 108 ప్రభుత్వ యూనిర్సిటీలు, 47 ప్రైవేట్ యూనివర్సిటీలు, 2 డీమ్డ్‌ యూనివర్సిటీలు ఉన్నాయి. గతంలో కమిషన్.. యూజీసీ రెగ్యూలేషన్స్‌-2023 నిబంధలను అనుగూణంగా విచారణ అధికారుల నియామకాన్ని తప్పనిసరి చేసింది. అయితే జనవరి 17న యూజీసీ నింబంధలను పాటించని పలు యూనివర్సిటీల పేర్లు బయటికి వచ్చాయి. ఈ యూనివర్సిటీలు నిబంధనలు పాటించకపోవడంపై యూజీసీ హెచ్చరించింది. అలాగే విచారణ అధికారులను ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

Also Read: నీట్‌ పేపర్ లీకైనా.. అతడికి తక్కువ మార్కులు !

ఇప్పుడు యూజీసీ విడుదల చేసిన జాబితాలో.. మధ్యప్రదేశ్‌లో ఏడు యూనివర్సిటీలను డిఫాల్టర్స్‌గా ప్రకటించారు. ఇందులో టిలో మఖన్‌లాల్ చతుర్వేది నేషనల్ జర్నలిజం అండ్ కమ్యూనికేషన్ యూనివర్సిటీ (భోపాల్), రాజీవ్ గాంధీ టెక్నాలజీ యూనివర్సిటీ (భోపాల్), జవహర్‌లాల్ నెహ్రూ అగ్రికల్చరల్ యూనివర్శిటీ (జబల్‌పూర్), మధ్యప్రదేశ్ మెడికల్ సైన్స్ యూనివర్సిటీ (జబల్‌పూర్), నానాజీ దేశ్‌ముఖ్ వెటర్నరీ సైన్స్ యూనివర్సిటీ (జబల్‌పూర్), రాజా మాన్‌సింగ్ తోమర్ మ్యూజిక్ అండ్ ఆర్ట్స్‌ (గ్వాలియర్) ఉన్నాయి.

లోపాలున్న ప్రభుత్వ యూనివర్సిటీలు
ఆంధ్రప్రదేశ్‌ నుంచి నాలుగు ప్రభుత్వ యూనివర్సిటీలను డిఫాల్టర్లుగా గుర్తించారు. బీహార్ 3, ఛత్తీస్‌గఢ్ 5, ఢిల్లీ 1, గుజరాత్ 4, హర్యానా 2, జమ్మూకశ్మీర్ 1, జార్ఖండ్ 4, కర్ణాటక13, కేరళ 1, మహారాష్ట్ర 7, మణిపూర్ 2, మేఘాలయ 1, ఒడిశా 11, పంజాబ్ 2, రాజస్థాన్ 7, సిక్కిం 1, తెలంగాణ 1, తమిళనాడు 3, ఉత్తరప్రదేశ్ 10, ఉత్తరాఖండ్ 4, పశ్చిమ బెంగాల్ 14 యూనివర్సిటీల్లో లోపాలు ఉన్నట్లు గుర్తించారు.

లోపాలున్న ప్రైవేటు యూనివర్సిటీలు

ఆంధ్రప్రదేశ్‌ నుంచి 2 ప్రైవేటు యూనివర్సిటీలను డిఫాల్టర్లుగా గుర్తించగా.. బిహార్‌లో కూడా 2 రెండు యూనివర్సిటీలు గుర్తించారు. గోవా 1, గుజరాత్ 6, హర్యానా 1, హిమాచల్‌ ప్రదేశ్ 1, జార్ఖండ్ 1, కర్నాటక 3, మధ్యప్రదేశ్ 8, మహారాష్ట్ర 2, రాజస్థాన్ 7, సిక్కిం 2, తమిళనాడు 1, త్రిపుర 1, ఉత్తరప్రదేశ్‌ 4, ఉత్తరాఖండ్ 2, అలాగే ఢిల్లీలో 2 యూనిర్సిటీలను డిఫాల్టర్లుగా ప్రకటించారు.

Also Read: ఢిల్లీలో వడగాడ్పులకు 192 మంది మృతి

#telugu-news #national-news #ugc #defaulter-universities
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe