/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-18-2.jpg)
చైనాలో యాగి తుపాన్ బీభత్సం సృష్టించింది. దీని ప్రభావంతో ఏకంగా గంటకు 234 కిలోమీటర్ల వేగాన్ని మించి బలమైన గాలులు వీచాయి. దీంతో వాహనాలతో పాటు మనుషులు కూడా కొట్టుకుపోయారు. చెట్లు నెలకూలాయి. పలు బిల్డింగ్‌లు ధ్వంసమయ్యాయి. పలుచోట్ల రేకుల షెడ్లు గాల్లో ఎగిరిపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. మరోవైపు తుపాను వల్ల హైనాన్ రాష్ట్రంలో వెంగ్టియాన్ టౌన్‌షిప్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో హైనాన్‌లోని నాండు, చాంగువా నదులకు వరద ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా గౌంగ్‌డాంగ్‌లో 5.70 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
Also Read: సునీత విలియమ్స్ లేకుండానే.. భూమిని చేరిన వ్యోమనౌక!
యాగీ తుపాన్ ప్రభావంతో అక్కడ దాదాపు 8 లక్షల ఇళ్లకు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. తుపాన్ కారణంగా ఇద్దరు మృతి చెందగా.. మరో 92 మంది గాయాలపాలయ్యారని చైనా ప్రభుత్వం చెబుతోంది. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం యాగీ తుపాన్ ప్రభావం వియత్నంపై కూడా పడింది. శనివారం ఉదయం ఈ తుపాను ఉత్తర వియత్నాం తీరాన్ని తాకింది. దీని ప్రభావంతో ఆ ప్రాంతంలో గంటకు 203 కిలోమీటర్ల వేగంతో భీకరంగా ఈదురు గాలులు వీచాయి. హైఫాంగ్ ప్రావిన్స్‌లో ఈదురుగాలులకు చెట్టు కూలడంతో ఒకరు మృతి చెందారు. మరికొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా వ్యవస్థ స్తంభించిపోయింది.
El #tifon Yagi llegando a China
#SuperTyphoonYagi#Yagi#Chinapic.twitter.com/UHBR2EzHXG— Tutiempo (@tiempobrasero) September 6, 2024
The window glass was broken, it seemed to have been torn off the hotel building 😨🇻🇳🙏
SUPER TYPHOON ALERT: YAGI INTENSIFIES
Super Typhoon #YAGI Heads Towards Northern #Vietnam#SuperTyphoonYagi#NorthernVietnampic.twitter.com/6S6BGcmfFC
— BeeLady 🇨🇭 📍🌼🐝 (@BeeLady__) September 7, 2024
అలాగే ఈ ప్రావిన్స్ పరిధిలో నాలుగు ఎయిర్‌పోర్ట్‌ల నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే వియత్నాంలోని తీర ప్రాంతాల నుంచి దాదాపు 50 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. యాగి తుపాను ప్రభావం తగ్గేవరకు ఇంట్లో నుంచి బయటకు రావొద్దని అధికారులు ప్రజలకు సూచించారు. ఇక వియాత్నం రాజధాని హనోయితో పాటు దేశ ఉత్తర భాగంలోని 12 ప్రావిన్సులలో స్కూళ్లను మూసివేశారు.
SUPER TYPHOON ALERT: YAGI INTENSIFIES
Super Typhoon #YAGI Heads Towards Northern #Vietnam#SuperTyphoonYagi#NorthernVietnampic.twitter.com/iAsYzeoqL6
— BeeLady 🇨🇭 📍🌼🐝 (@BeeLady__) September 6, 2024
Locals scream as truck is overturned # #SuperTyphoonYagi#TyphoonYagi#SouthernChina#915hPa
pic.twitter.com/ajkvpSyS8zhttps://t.co/KEocatMPCy— The Vigilante (@NewsByVigilante) September 6, 2024
Terrifying winds hits due to Typhoon Yagi in Halong Bay of Quảng Ninh province, Vietnam 🇻🇳 (07.09.2024)
TELEGRAM JOIN 👉 https://t.co/9cTkji4D9Spic.twitter.com/MruMSUuGx1
— Disaster News (@Top_Disaster) September 7, 2024
Also Read: ముస్తాబైన గణనాథుడి మండపాలు.. పలుచోట్ల మొదలైన భక్తుల తాకిడి!