Salman Khan: సల్మాన్‌ ఇంటివద్ద కాల్పులు చేసిన నిందితులు అరెస్టు..

ఇటీవల బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ నివాసం వద్ద కాల్పులు జరిపిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కాల్పుల అనంతరం నిందితులు ముంబయి నుంచి పారిపోగా.. చివరికి గుజరాత్‌లో పోలీసులకు చిక్కారు. నిందితులను ముంబయి తీసుకొచ్చి విచారిస్తామని పోలీసులు తెలిపారు.

New Update
Salman Khan: సల్మాన్‌ ఇంటివద్ద కాల్పులు చేసిన నిందితులు అరెస్టు..

ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ నివాసం వద్ద కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. ఎట్టకేలకు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. కాల్పులు జరిగిన తర్వాత నిందితులు ముంబయి నుంచి పారిపోయారు. చివరికి గుజరాత్‌లోని భూజ్‌లో పోలీసులుకు చిక్కారు. సోమవారం రాత్రి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే వారిని ముంబయికి తీసుకొచ్చి విచారణ చేస్తామని పోలీసులు పేర్కొన్నారు.

Also Read: భారత్‌లో 2 లక్షల అకౌంట్లపై నిషేధం.. కారణం ఇదే

ఈ నిందితులు నవీ ముంబయిలోని హరిగ్రామ్ అనే ప్రాంతంలో నెలరోజులుగా అద్దె ఇంట్లో ఉంటున్నట్లు ఓ అధికారి వెల్లడించారు. సల్మాన్‌ ఖాన్‌కు కూడా పన్వెల్‌లోనే ఫాంహౌస్ ఉంది. కాల్పులు జరిగిన తర్వాత కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు సోమవారం ముగ్గురు వ్యక్తులను విచారించారు. వీళ్లలో నిందితులకు ఇంటిని అద్దెకు ఇచ్చిన యజమాని, నిందితులు వాడిన బైక్ పూర్వ యజమాని. బైక్‌ను అమ్మడంలో సహకరించిన ఏజెంట్‌లు ఉన్నారు.

అలాగే వీళ్లతో పాటు మరికొంతమందిని కూడా పోలీసులు విచారించారు. ఈ దర్యాప్తులో నిందితులు వాడిన బైక్‌ పూర్వ యజమానిది కూడా పన్వెల్‌ ప్రాంతమని తేలింది. ఎట్టకేలకు కాల్పులు జరిపిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇదిలాఉండగా.. ఆదివారం ఉదయం ఐదు గంటల సమయంలో.. బాంద్రా ప్రాంతంలోని సల్మాన్‌ ఖాన్ ఉండే గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌ వద్దకు బెక్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.

Also Read: బీజేపీని ఓడించకపోతే జరిగేది అదే.. దీదీ సంచలన వ్యాఖ్యలు

Advertisment
Advertisment
తాజా కథనాలు