Accident : అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి..

అమెరికాలోని ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందారు. శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నివేశ్, గౌతమ్‌ అనే విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. నివేశ్‌ది కరీనంగర్ జిల్లాలోని హుజురాబాద్. గౌతమ్‌ది జనగామ జిల్లాలోని శివునిపల్లి గ్రామ

New Update
Accident : అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి..

Students :ఈ మధ్య అమెరికా(America) లో వరుసగా భారతీయ విద్యార్థులు(Indian Students) మరణవార్తలు రావడం కలకలం రేపుతోంది. అయితే తాజాగా అమెరికాలోని మరో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందారు. శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం(Road Accident) లో ఆ ఇద్దరు మృతి చెందారు. మృతులు నివేశ్, గౌతమ్‌లుగా అధికారులు గుర్తించారు. నివేశ్‌ది కరీనంగర్ జిల్లాలోని హుజురాబాద్. గౌతమ్‌ది జనగామ జిల్లాలోని శివునిపల్లి గ్రామం. ప్రస్తుతం నివేశ్‌, గౌతమ్‌లు అరిజోనా స్టేట్ యూనివర్సిటీలోని బీటెక్ చదువుతున్నారు. వీళ్లిద్దరూ కారులో వెళ్తుండగా.. మరో కారును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ రోడ్డు ప్రమాదం జరగడానికి ఒకరోజు ముందు తన తండ్రితో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు విద్యార్థల మృతితో స్థానిక గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Also Read: ప్రచారంలో రేవంత్‌ దూకుడు..నేడు పాలమూరు పర్యటన

Advertisment