Hyderabad: హైదరాబాద్‌లో ఘోరం జరిగింది. నగరంలోని పహడి షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ స్విమ్మింగ్‌లో ఫూల్లో స్నానానికి వెళ్లిన ఓ కుటుంబ సభ్యులంతా కరెంట్ షాక్ కు గురైయ్యారు. ఈ ప్రమాదంలో సుమారు 16 మందికి తీవ్ర గాయాలు కాగా ఇద్దరికి పరిస్థితి విషమంగా ఉంది. నగరంలోని జల్పల్లి ప్రాంతంలోని ఓ ఫాంహౌస్‌లో ఆహ్లాదంగా గడిపేందుకు నాంపల్లి అగహాపురకు చెందిన ఓ కుటుంబానికి చెందిన వారంతా ఫాంహౌస్‌కు వెళ్లారు.
ఈ క్రమంలో వారంతా స్విమ్మింగ్ ఫూల్లో సరదాగా ఈత కొడుతున్న సమయంలో నీటిలో విద్యుత్ సరఫరా అయి కరెంట్ షాక్ కొట్టింది. ఈ ప్రమాదంలో ఫర్వేజ్, ఇలియాజ్ అనే వారి పరిస్థితి సీరియస్ గా ఉండడంతో కుటుంబ సభ్యులు వారిని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటన గురించి బాధితులు ఎవరూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.
ఈ సంఘటనలో మహిళలు, పిల్లలు, యువకులు కరెంట్ షాక్‌కు గురైన వారిలో ఉన్నారు. విద్యుత్ షాక్‌కు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.