Hyderabad: స్విమ్మింగ్‌ ఫూల్‌లో కరెంట్‌ షాక్‌..16 మందికి తీవ్ర గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం!

హైదరాబాద్‌లో నాంపల్లి అగహాపురకు చెందిన ఓ కుటుంబానికి చెందిన వారంతా ఫాంహౌస్​ లో సరదాగా గడిపేందుకు వెళ్లారు. వారంతా స్విమ్మింగ్‌ పూల్ లో సరదాగా ఈత కొట్టేందుకు దిగగా..వారికి ఒక్కసారిగా కరెంట్‌ షాక్ కొట్టింది. 16 మందికి షాక్‌ కొట్టగా..వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

New Update
Hyderabad: స్విమ్మింగ్‌ ఫూల్‌లో కరెంట్‌ షాక్‌..16 మందికి తీవ్ర గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం!

Hyderabad: హైదరాబాద్‌లో ఘోరం జరిగింది. నగరంలోని పహడి షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ స్విమ్మింగ్​లో ఫూల్‌​లో స్నానానికి వెళ్లిన ఓ కుటుంబ సభ్యులంతా కరెంట్ షాక్‌ కు గురైయ్యారు. ఈ ప్రమాదంలో సుమారు 16 మందికి తీవ్ర గాయాలు కాగా ఇద్దరికి పరిస్థితి విషమంగా ఉంది. నగరంలోని జల్​పల్లి ప్రాంతంలోని ఓ ఫాంహౌస్​​లో ఆహ్లాదంగా గడిపేందుకు నాంపల్లి అగహాపురకు చెందిన ఓ కుటుంబానికి చెందిన వారంతా ఫాంహౌస్​కు వెళ్లారు.

ఈ క్రమంలో వారంతా స్విమ్మింగ్ ఫూల్‌​లో సరదాగా ఈత కొడుతున్న సమయంలో నీటిలో విద్యుత్ సరఫరా అయి కరెంట్ షాక్ కొట్టింది. ఈ ప్రమాదంలో ఫర్వేజ్, ఇలియాజ్ అనే వారి పరిస్థితి సీరియస్‌ గా ఉండడంతో కుటుంబ సభ్యులు వారిని ఓ ప్రైవేట్​ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటన గురించి బాధితులు ఎవరూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.

ఈ సంఘటనలో మహిళలు, పిల్లలు, యువకులు కరెంట్ షాక్​కు గురైన వారిలో ఉన్నారు. విద్యుత్ షాక్​కు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు