Telangana: డబ్బులు అనుకుని బుల్లెట్లు ఎత్తుకెళ్లాడు.. కట్ చేస్తే డబుల్ ట్విస్ట్.. రైల్వే స్టేషన్ లో చోరీకి గురైన ఇన్సాస్ గన్ బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ బుల్లెట్లను ఎత్తుకెళ్లిన ఇద్దరు నిందితులను కూడా అరెస్ట్ చేశారు. అయితే, విచారణలో షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో కానిస్టేబుల్ వద్దనున్న బ్యాగ్ చూసి డబ్బుల ఉన్నాయని అనుకుని చోరీకి పాల్పడ్డాడట దొంగ. ఓపెన్ చేయగా బుల్లెట్లు ఉండటంతో.. అక్కడే వదిలేశాడు. మరో వ్యక్తి ఆ బుల్లెట్లను తీసుకెళ్లి ఇంట్లో దాచిపెట్టాడు. By Shiva.K 26 Oct 2023 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి Hyderabad: చోరీ అయిన ఇన్సాస్ గన్ బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నేరానికి పాల్పడ్డ ఇద్దరిని అరెస్ట్ చేశారు. డీజీపీ అంజనీ కుమార్(DGP Anjani Kumar) తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. చాంద్రాయణగుట్టలోని 95వ సీఆర్పీఎఫ్ బెటాలియాన్‌లో సిద్దార్థ్ సింగ్ కానిస్టేబుల్. ఈనెల 24న సిద్దార్థ్ సికింద్రాబాద్(Secunderabad) రైల్వే స్టేషన్‌కు వచ్చాడు.10వ ప్లాట్ ఫాం పై ఉండగా అతని నుంచి ఇన్సాస్ గన్‌కు సంబంధించిన 60 బుల్లెట్లు పౌచ్‌తో సహా బ్యాగ్‌ను ఎత్తుకెళ్లారు దొంగలు. వెంటనే సిద్దార్థ్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విషయం తెలిసిన వెంటనే రైల్వేస్ అదనపు డీజీ శివధర్ రెడ్డి, ఎస్పీ షేక్ సలీమా జీఆర్పీ, ఆర్పీఎఫ్ సిబ్బందితో ఎనిమిది బృందాలను రంగంలోకి దింపారు. స్టేషన్లోని సీసీ కెమెరాల ఫుటేజీని విశ్లేషించిన ప్రత్యేక బృందాలు శ్రీకాకుళం జిల్లాకు చెందిన నక్కెని ఆనంద మూర్తి బుల్లెట్లు తస్కరించినట్టు కనుగొన్నారు. ఇదికూడా చదవండి:ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీటిని తాగితే 5 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. అతని కోసం గాలింపు చేపట్టి గాంధీనగర్ మెట్రో స్టేషన్ ప్రాంతంలో పట్టుకున్నారు. అయితే, దొంగిలించిన బుల్లెట్లు అతని వద్ద దొరకలేదు. దాంతో ఆనంద మూర్తిని విచారించగా గాంధీనగర్ మెట్రో స్టేషన్ పరిసరాల్లో బుల్లెట్లను వదిలేసినట్టు చెప్పాడు. తాను డబ్బులు ఉన్నాయని దొంగిలించానని, అందులో బుల్లెట్లను చూసి భయంతో అక్కడే వదిలేసినట్లు చెప్పాడు. దాంతో మెట్రో స్టేషన్ పరిసరాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా ఎరుపు రంగు దుస్తులు ధరించిన ఓ వృద్ధుడు అనుమానాస్పదంగా కనిపించాడు. విచారణ చేపట్టగా సదరు వృద్ధుడు భోలక్ పూర్ కు చెందిన సత్యనారాయణ అని నిర్ధారణ అయ్యింది. ప్రత్యేక బృందాలు అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నాయి. దర్యాప్తులో మార్నింగ్ వాక్ కోసం వెళ్ళినపుడు బుల్లెట్లతో ఉన్న పౌచ్ కనిపించటంతో తీసి దగ్గర పెట్టుకున్నట్టు సత్యనారాయణ వెల్లడించాడు. ఈ క్రమంలో అతన్ని కూడా అరెస్ట్ చేశారు. నిందితులను పట్టుకోవటంలో కీలక పాత్ర పోషించిన జీఆర్పీ సీఐ ఎం. శ్రీను, హెడ్ కానిస్టేబుళ్లు మహిపాల్ రెడ్డి, భవానీ శంకర్, కానిస్టేబుళ్లు హరిలాల్, శ్రావణ్ కుమార్, రాంచందర్, శ్రీనివాసులు, సీతారాములును డీజీపీ అభినందించారు. అదే విధంగా ఆర్పీఎఫ్ కు చెందిన సీఐ రవిబాబు, ఎస్సైలు త్రిమూర్తులు, శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుళ్లు మురళీ కృష్ణ, శివప్రసాద్, కానిస్టేబుళ్లు వీరేంద్ర సింగ్, రోహతాష్ లను కూడా డీజీపీ అభినందించారు. ఇదికూడా చదవండి: పదవి విరమణ తరువాత నెలవారీగా పెన్షన్ పొందాలనుకుంటున్నారా? ఈ పథకం బెస్ట్! #telangana-news #telangana #hyderabad #telangana-police #hyderabad-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి