Hyderabad : రాడిసన్ డ్రగ్స్ కేసులో చిక్కిన కీలక నిందితులు రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. కాగా మరికొంతమందిని ఇంకా పట్టుకోవాల్సి ఉంది. By Manogna alamuru 21 Mar 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Radisson Drugs Case : రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు(Radisson Hotel Drugs Case) లో కీలక వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 25న నమోదైన ఈ కేసులో ఇప్పటికే పలువురిని గచ్చిబౌలీ పోలీసులు(Gachibowli Police) అరెస్ట్ చేశారు. ఇందులో మాజీ ఎమ్మెల్యే కొడుకు, రోశయ్య(Rosaiah) అల్లుడు వివేకానంద(Vivekananda) తో పాటూ మరికొంత మంది నిందితులుగా ఉన్నారు. మొత్తం 10మందిని ఇందులో నిందితులుగా చేర్చారు. వీరిలో టాలీవుడ్(Tollywood) డైరెక్టర్ క్రిష్(Director Krish) జాగర్లమూడి కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు ఇందులో డ్రగ్స్ సరఫరా చేసిన కీలక నిందితులు ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. ఆరు కేసుల్లో దాదాపు మూడేళ్ళుగా పరారీలో ఉన్న అబ్దుల్ రహ్మాన్, నరేంద్ర శివనాథ్‌లను గచ్చిబౌలీ, మాదాపూర్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేయగలిగారు. వీరి దగ్గర నుంచి ఖరీదైన కారు, 11 గ్రాముల ఎండీఎంఏ, ఏడు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ముషీరాబాద్‌కు చెందిన అబ్దుల్ రెహ్మాన్‌కు ప్రస్తుతం హైదరాబాద్(Hyderabad) జైల్లో ఉన్న ఫైజల్‌తో 2021 నుంచి సంబంధాలున్నాయి. దేశవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఫైజల్ ద్వారా రెహ్మాన్ డ్రగ్స్ తెప్పించుకునేవాడని పోలీసులు చెబుతున్నారు. ఫైజల్ ఢిల్లీలో డ్రగ్స్‌ను అందించేవాడు. అక్కడ శివనాథ్ వాటిని తీసుకుని రహ్మాన్‌కు ఇచ్చేవాడు. తరువాత ఇద్దరూ కలిసి ముంబయ్, హైదరాబాద్, బెంగళూరులలో డ్రగ్స్‌ను విక్రయించేవారు. దీని కోసం వీరు మొత్తం 15 మంది అనుచరులను కూడా పెట్టుకున్నారు. వీరి టార్గెట్ పబ్బుల దగ్గర యువత. అబ్దుల్ మీద ఇప్పటికే హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో 6 కేసులు నమోదయ్యాయి. రాడిసన్‌కు డ్రగ్స్ ఎలా వచ్చాయి అంటే... హోటల్‌లో డ్రగ్స్ పార్టీ నిర్వహించిన వివేకానందకు అతని దగ్గరే కొన్నాళ్ళు పని చేసిన సయ్యద్ అబ్బాస్ అలీ జాఫ్రీ డ్రగ్స్ సరఫరా చేశాడు. అతణ్ని ఫోలీసులు విచారించగా అత్తాపూర్‌లోని కేఫ్ రెస్టారెంట్‌లో క్యాషియర్‌గా పని చేసే మీర్జా వహీద్ బేగ్ ద్వారా వచ్చినట్లు తెలిసింది. మీర్జాను విచారించగా...ముషీరాబాద్‌కు చెందిన సయ్యద్ అబ్దుల్ రెహ్మాన్ లింకు గురించి తెలిసింది. ఇక రాడిసన్ హోటల్ లో డ్రగ్స్ పార్టీ నిర్వహించిన మంజీరా గ్రూపు(Manjeera Group) సంస్థల డైరెక్టర్ గజ్జల వివేకానంద్, నిర్భయ్ సింధి (26), సలగంశెట్టి కేదార్‌నాథ్(36) లను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. డైరెక్టర్ క్రిష్‌ను పోలీసులు విచారించారు. దాంతో పాటూ ఈ గలీజ్ దందాలో పది మంది వీఐపీల హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. Also Read : Today Gold Rate : బంగారం ధర మారలేదు.. వెండి కాస్త తగ్గింది! #telangana #hyderabad #radisson-drugs-case మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి